Read News in Telugu Language
adsdaksha

thamanna : పెళ్లికి సిద్ధమవుతున్న తమన్నా-విజయ్ వర్మ.. కామాఖ్యా ఆలయంలో ప్రత్యేక పూజలు..

దక్ష సినిమా న్యూస్, హైదరాబాద్ : జనవరి 28

హ్యాపీడేస్ సినిమాతో తెలుగులో అరంగేట్రం చేసిన తమన్నా తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఎదిగిపోయారు. ఆ తర్వాత తమిళ, హిందీ సినిమాల్లోను పాపులర్ అయ్యారు. విజయ్ వర్మతో ఓచిత్రం చేస్తున్న టైమ్ లో తమన్నా-విజయ్ వర్మ ప్రేమలో పడ్డారు. ఇద్దరూ ఒకరిపై ఒకరికి ఉన్న ఇష్టాన్ని పబ్లిక్‌గా ఒప్పుకున్నారు కూడా. కాగా వీరిద్దరూ త్వరలో పెళ్లికి సిద్ధమవుతున్నారంటూ వార్తలు సైతం వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తమన్నా ఇంట్లో పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తమన్నా అస్సాం గౌహతీలోని నీలాచల్ హిల్స్‌లోని ప్రసిద్ధ కామాఖ్యా ఆలయంలో కుటుంబంతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనిని బట్టి త్వరలోనే తమన్నా విజయ్ వర్మతో పెళ్లి వార్త చెప్పబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

read also : బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ లోకి తీగల క్రిష్ణారెడ్డి..?

Hospital

తమన్న కుటుంబంతో కలిసి గుడిలో పూజలు నిర్వహించడం చూసి ఈ జంట గుడ్ న్యూస్ చెబుతారని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇటీవల తమన్న-విజయ్ వర్మ డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా వీరిద్దరూ పెళ్లికి రెడీ అయ్యారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. తమన్నా తన కుటుంబంతో కామాఖ్యా ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడం అందుకు బలాన్ని చేకూరుస్తోంది.

ఇక తమన్నాతెలుగులో ప్రస్తుతం ఏ సినిమా చేయడం లేదు. తమిళంలో కూడా ఒక ప్రాజెక్టు మాత్రమే ఉంది. అయితే ఆ మధ్య వచ్చిన జైలర్ లోని ‘కావాలయ్యా’ పాట మాత్రం ఒక ఊపు ఊపింది. విజయ్ వర్మ సూర్య 43 లో నటిస్తున్నారు. త్వరలోనే వీరిద్దరూ అధికారికంగా పెళ్లికబురు చెబుతారేమో వేచి చూడాలి.

Leave A Reply

Your email address will not be published.