Read News in Telugu Language
adsdaksha

విజయ్ పొలిటికల్ ఎంట్రీ.. తమిళనాట కొత్త రాజకీయ పార్టీ..

దక్ష న్యూస్, హైదరాబాద్: ఫిబ్రవరి 3

తమిళనాడులో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. తమిళగ వెట్రి కళగం పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు అయింది. ప్రముఖ నటుడు, దళపతి విజయ్‌ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తమిళగ వెట్రి కళగం ( tamilaga vetri kalagam ) పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. ఈ మేరకు విజయ్‌ అధికారికంగా సోషల్‌ మీడియాలో ప్రకటించారు. అయితే తన టార్గెట్ 2024 ఎన్నికలు కాదని స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా మద్దతు ఇవ్వబోమని ప్రకటించారు. 2026 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం తమిళనాడులో అవినీతి పాలన కొనసాగుతోంది. దానిపై వ్యతిరేకంగా పోరాడేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని దళపతి చెప్పారు.

Hospital

Read also: కాంగ్రెస్ సర్కార్ ను కూల్చే దమ్ముందా ..? ఊర్లకు వస్తే ప్రజలే తరిమి కొడతారు..

పార్టీని నమోదు చేసేందుకు మా నేతలు దిల్లీకి వెళ్లారని విజయ్ వెల్లడించారు. ఇక తాను సైన్ చేసిన సినిమాల్లో మరొకటి పెండింగ్ ఉందని దాన్ని పూర్తి చేసి పూర్తిగా రాజకీయాల్లోకి వస్తానని తెలిపారు. నా రాజకీయ ప్రయాణానికి నన్ను నేను సిద్ధం చేసుకుంటున్నాను. తమిళనాడు ప్రజలకు తాను అంకితమని విజయ్ తెలిపారు. తమిళనాట సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తర్వాత ఆ స్థాయి స్టార్‌డమ్‌ ఉన్న నటుడు విజయ్‌. మరి ఆయన రాజకీయాల్లో ఏ మేరకు రాణిస్తారో చూడాలి.

Leave A Reply

Your email address will not be published.