Read News in Telugu Language
adsdaksha

గురుపూజోత్సవంలో పాల్గొనడం గొప్ప మధురానుభూతి ..

దక్ష న్యూస్, హైదరాబాద్: సెప్టెంబర్ 5

సామాన్యుడి నుంచి ప్రధాన మంత్రి వరకు అందరినీ తీర్చిదిద్దేది గురువే ..

ఒక ఉపాధ్యాయుడి పుత్రుడిగా గురుపూజోత్సవం కార్యక్రమంలో పాల్గొనడం మర్చిపోలేని గొప్ప అనుభూతినిస్తోందని మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ ( minister dr. v. srinivas gaud ) అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం ( teachers day )  సందర్భంగా మహబూబ్ నగర్ ( mahabubnagar )  జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టర్ ( idoc ) కార్యాలయంలో మంగళవారం గురుపూజోత్సవం ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి డా. వి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతూ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన గురువులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో సామాన్యుడి నుంచి ప్రధాన మంత్రి వరకు ప్రతీ ఒక్కరినీ తీర్చిదిద్దేది గురువే అని, అందుకే అందరి కంటే టీచర్లకు సమాజంలో గొప్ప గుర్తింపు ఉంటుందన్నారు.

Hospital

read also : తెలంగాణలోని 40 బీసీ కులాలను OBC జాబితాలో చేర్చండి..

చిన్నప్పటి నుంచి గురువుల మాట విని క్రమశిక్షణతో పెరిగిన విద్యార్థులు గొప్పగా రాణిస్తారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది ధైర్యంగా టీచర్లు పాల్గొన్నారని, ఉద్యమంలో వారి పాత్ర వెలకట్టలేనిదన్నారు. ఉపాధ్యాయులు పదవీ విరమణ చేసిన తర్వాత కూడా చాలామంది గ్రామాల్లో తమ సేవలను అందిస్తున్నారని తెలిపారు. సామాజిక కార్యక్రమాల ద్వారా సమాజానికి గొప్ప సేవ చేస్తున్నవారు ఉన్నారన్నారు. ఒకప్పుడు సరైన మౌలిక సదుపాయాలు లేని బడుల్లో పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులు… ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత చక్కగా తీర్చిదిద్దిన బడుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు.

దేశంలోనే ఉద్యోగులకు అత్యధిక వేతనాలు అందిస్తున్నది తెలంగాణ రాష్ట్రమే అని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి ఉపాధ్యాయులకు పీఆర్సీ ఇచ్చేలా ప్రయత్నిస్తాం అన్నారు. ఒకప్పుడు అత్యధిక పేదరికం, కరువు, నిరక్షరాస్యత ఉన్న జిల్లా పాలమూరు అని పాఠాలు చెప్పే దశ నుంచి నేడు అన్ని రంగాల్లోనూ మన జిల్లా ముందు వరదలోకి వచ్చిందని చెప్పే పరిస్థితి రావడం గొప్ప విషయం అన్నారు. అత్యున్నతంగా కష్టపడిన వారు ప్రభుత్వ ఉపాధ్యాయులు గా కొలువుల్లో చేరుతున్నారన్నారు. వీరిలో చాలా మంది గ్రూప్స్, సివిల్స్ కు ఎంపికవుతున్నారు. అంతటి గొప్ప పరిజ్ఞానం వారిది అని కొనియాడారు.

read also : rain alert : తెలంగాణ కు భారీ వర్ష సూచన .. 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ ..

కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్, ఎస్పీ నరసింహ, జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, అడిషనల్ కలెక్టర్ మోహన్ రావు, జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్, ఆర్డీవో అనిల్ కుమార్, జిల్లా పర్యాటకశాఖ అధికారి వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు నారాయణ గౌడ్, రఘురాం రెడ్డి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.