Read News in Telugu Language
adsdaksha

టీమ్ ఇండియా 2024 షెడ్యూల్ ఇదే..

దక్ష న్యూస్, క్రీడలు: జనవరి 2

ఈ ఏడాది మొత్తం టీమిండియా (Team India) బిజీ షెడ్యూల్తో గడపనుంది.

టీ20 ప్రపంచ కప్ కూడా ఈ ఏడాదికే కావటంతో,  గత ఏడాది వరల్డ్ కప్ ఫైనల్ ఓటమిని మరిచే విధముగా, దేశానికి టీ-20 వరల్డ్ కప్ అందించాలని టీమిండియా గట్టి పట్టుదలతో ఉంది.

భారత జట్టు స్వదేశంతో పాటు విదేశాల్లోనూ చాలా సిరీస్‌లు ఈ ఏడాది ఆడనుంది.

Read also: ఏపీ లోనూ ఆర్టీసి బసుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం..

ఈ నెల 3 నుంచి 7వ తేదీ వరకు దక్షిణాఫ్రికాతో కేప్ టౌన్‌లో రెండో టెస్టు జరగానున్నడగా, ఆ తర్వాత ఆప్గాన్‌తో  టీ20 సిరీస్ జరగనుంది.

అంతే కాకుండా ఇదే నెలలో ఇంగ్లండ్ జట్టు భారత్‌లో పర్యటించి, టెస్టులు మ్యాచ్లు కూడా ఆడనుంది.

మూడు ఐసీసీ టోర్నీలు ఆడనున్న టీమిండియా
ఏప్రిల్-మే మధ్య ఐపీఎల్ (IPL) కారణంగా అంతర్జాతీయ మ్యాచ్‌లకు విరామం లభించనుంది.

ఈ ఏడాదిలో భారత జట్టు మూడు ఐసీసీ(ICC) ట్రోఫీలలో ఆడనుంది.

పురుషుల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా జూన్‌ 4- 30 వరకు వెస్టిండీస్‌, అమెరికా వేదికలుగా జరుగబోయే మెగాటోర్నీలో పాల్గొననుంది.

Hospital

Read also: ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడిన చిన్నారి..

*షెడ్యూల్‌ ఇదే*..

* జనవరి 3-7 : రెండో టెస్టు (కేప్‌టౌన్‌, దక్షిణాఫ్రికా)

* జనవరి 11 నుంచి 17 వరకు అఫ్గానిస్తాన్‌తో మూడు టీ20లు (స్వదేశంలో)

* జనవరి 25 నుంచి 29 వరకు ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ (స్వదేశంలో)

* జూన్‌ 4 నుంచి 30 దాకా టీ20 వరల్డ్‌ కప్‌ (వెస్టిండీస్‌-అమెరికా)

* జులై లో శ్రీలంక పర్యటన.. రెండు టెస్టులు, మూడు టీ20లు

* సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో రెండు టెస్టులు, మూడు టీ20లు (స్వదేశంలో)

* అక్టోబర్‌లో న్యూజిలాండ్‌తో మూడు టెస్టులు (స్వదేశంలో)

* నవంబర్‌ నుంచి జనవరి 2025 దాకా ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఐదు టెస్టులు మ్యాచ్లు జరగనున్నాయి.

Leave A Reply

Your email address will not be published.