Read News in Telugu Language
adsdaksha

విద్యార్ధులు తమ బ్లడ్ గ్రూప్ తెలుసుకోవడం ఎంతో అవసరం..

దక్ష న్యూస్, సత్తుపల్లి: ఆగస్ట్ 29

రక్తదానం ప్రాణదానంతో సమానమని, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తదానం చేయడం ద్వారా ప్రాణాపాయ స్థితినుండి కాపాడవచ్చని సత్తుపల్లి ( sattupalli ) తేజ ఒకేషనల్ కళాశాల ( teja vocational college)  ప్రిన్సిపాల్ సిహెచ్ ప్రభాకర్ రావు( ch. prabhakar rao )  అన్నారు. యువ సేవా సమితి ( yuva seva samithi ) ఆధ్వర్యంలో మంగళవారం కళాశాలలో బ్లడ్ గ్రూపింగ్ క్యాంప్ నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్ రావు క్యాంపును ప్రారంభించి విద్యార్ధులనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అన్ని దానాల్లోకెల్లా రక్తదానం ఎంతో పుణ్యప్రదమైందన్నారు. విద్యార్ధులు తమ బ్లడ్ గ్రూప్ తెలుసుకోవడం వల్ల అవసరమైన వారికి సకాలంలో రక్తదానం చేసే అవకాశం కలుగుతుందన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి రక్తదానం చేయడం ద్వారా ఇతరులకు స్పూర్తిమంతంగా నిలవాలన్నారు.

read also : mahesh : మహేష్ బాబు రాజకీయ ఆరంగేట్రం..వైసీపీలోకి ఎంట్రీ..?

Hospital

ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన యువ సేవా సమితి సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. యువ సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సహకరించిన సేవ వాలంటరీ బ్లడ్ బ్యాంక్ రాకేష్, అబ్దుల్లా లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు సేవా సమితి ఇంచార్జ్ ప్రిన్స్ ఇమ్రాన్ వెంకీ షాజహాన్ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

read also : సెప్టెంబర్ 1 న స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకలు .. హాజరవనున్న సి.ఎం కేసీఆర్ ..

Leave A Reply

Your email address will not be published.