Read News in Telugu Language
adsdaksha

సీఎం గారూ.. టైఫిస్ట్ పోస్టులు భర్తీ చేయండి.. సెక్రటేరియట్ ముందు ప్లకార్డులతో నిరుద్యోగుల నిరసన..

దక్ష న్యూస్, హైదరాబాద్: ఫిబ్రవరి 10

తెలంగాణ వ్యాప్తంగా 50వేలకు పైగా ఉన్న నిరుద్యోగ టైఫిస్ట్ లకు న్యాయం చేయాలని, టైఫిస్ట్ నిరుద్యోగులు, టైప్ రైటింగ్ షార్ట్ హ్యాండ్ సంఘం డిమాండ్ చేసింది. శనివారం రాష్ట్ర సచివాలయం ముందు టైపిస్ట్ లు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు నిరుద్యోగులు మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జాబ్స్ రాకపోవడంతో తెలంగాణ వస్తే మన ఉద్యోగాలు మనకు వస్తాయని ఎంతో ఆశగా ఎదురుచూస్తే మాజీ సీఎం కేసీఆర్ మాకు ద్రోహం చేశారని మండిపడ్డారు.

Read also: రాష్ట్రంలో భారీగా ట్రాన్స్ ఫర్స్ ..32 మంది డిప్యూటీ కలెక్టర్లు, 132 మంది ఎమ్మార్వోల బదిలీలు ..

Hospital

తెలంగాణలో 10 జిల్లాలు ఉండగా 33 జిల్లాలకు పెంచిన గత ప్రభుత్వం టైఫిస్ట్, స్టెనో పోస్టులు భర్తీ చేయకుండా అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం టైపిస్టు, స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీపై నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు. గతంలో నిర్వహించిన గ్రూప్ 4లో టైఫిస్ట్, స్టెనో పోస్టులు లేకుండా నోటిఫికేషన్ ఇచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగులు, యువత ఓట్లతో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Read also: భారత్ రికార్డు… 97 కోట్లకు చేరిన ఓటర్లు.. 2 కోట్ల మంది యూత్ కొత్తగా నమోదు ..

వెంటనే టైఫిస్ట్, స్టెనో పోస్టులకు ప్రత్యేక నోటిఫికేషన్ ఇచ్చి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని త్వరలో ప్రభుత్వం విడుదల చేయబోయే నోటిఫికేషన్లలో టైపిస్టు, స్టెనోగ్రాఫర్ పోస్టుల సంఖ్యను పెంచి, నిరుద్యోగులను ఆదుకోవాలని వారు కోరారు.

Leave A Reply

Your email address will not be published.