Read News in Telugu Language
adsdaksha

పది వర్శిటీలకు ఇంచార్జ్ వీసీల నియామకం..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..

దక్ష న్యూస్, హైదరాబాద్ : మే 22

తెలంగాణలోని పది విశ్వవిద్యాలయాలకు ఇన్చార్జి వైస్ చాన్సెలర్లను నియమిస్తూ మంగళవారం రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న వీసీల పదవీకాలం పూర్తికావడంతో ఇన్చార్జిలుగా ఐఏఎస్ అధికారులను నియమించింది. కొత్త వీసీలు నియమితులయ్యేంత వరకూ వీరే ఆయా బాధ్యతల్లో కొనసాగుతారని తేల్చి చెప్పింది.

Read also: సెల్ ఫోన్ చూసే ప్రతీ ఒక్కరికీ మల్లన్న పోరాటం తెలుసు : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు..

Hospital

ఇప్పటికే కొత్త వీసీల కోసం అన్ని వర్శిటీలలో సెర్చ్ కమిటీలు ఏర్పాటయ్యాయి. జాబితాలను పరిశీలించిన తర్వాత ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నది. ప్రస్తుతం ఇన్చార్జిలుగా వ్యవహరించే ఐఏఎస్ అధికారులు, ఆయా యూనివర్శిటీల వివరాలు ఇలా ఉన్నాయి.

ఉస్మానియా : దాన కిషోర్, జేఎన్టీయూ : బుర్రా వెంకటేశం, కాకతీయ : వాకాటి కరుణ, అంబేద్కర్ ఓపెన్ వర్శిటీ : రిజ్వి, తెలంగాణ వర్సిటీ : సందీప్ కుమార్ సుల్తానియా, పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ : శైలజా రామయ్యర్, మహాత్మాగాంధీ వర్సిటీ : నవీన్ మిట్టల్, శాతవాహన వర్సిటీ : సురేంద్రమోహన్, జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ : జయేష్ రంజన్, పాలమూరు యూనివర్సిటీ : నదీం అహ్మద్ లను నిమామిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Leave A Reply

Your email address will not be published.