Read News in Telugu Language
adsdaksha

యాసే కాదు భాష మధురం..

దక్ష న్యూస్, ఆధ్యాత్మికం.

తెలంగాణ బాష దినోత్సవం సందర్భంగా..

తెలుగు ప్రేమికుల కోసం కొన్ని విషయాలు..

తెలుగు మాతృ భాష గా ఎవరికి వున్నదో, తెలుగు భాష ను ఎవరు ప్రేమిస్తున్నారో, తెలుగు గురించి ఎవరు తెలుసుకుందామకుంటున్నారో వారి కోసం కొన్ని తేట తెలుగు విషయాలు.

1. తెలుగు భాష సుమారు క్రీ. పూ. 400 క్రితం నుండి  వుంది.

2. 2012 లో తెలుగు లిపి ప్రపంచం లోనే రెండవ గొప్ప లిపిగా “International Alphabet Association” ద్వారా ఎన్నుకోబడినది.
మొదటి లిపిగ కొరియన్ భాష.

3. తెలుగు భాష మాట్లాడడం వల్ల మన శరీరం లో గల 72000 నాడులు వుత్తేజితమౌతాయని శాస్త్రం ద్వారా నిరూపితమైంది. మిగిలిన భాష ల కన్న ఇది చాలా చాలా ఎక్కువ.

4. శ్రీలంక లో గల జిప్సీ తెగ ప్రజలు ఎక్కువగా తెలుగు మాట్లాడతారు.

5. మయన్మార్ లో చాలా మంది తెలుగు మాట్లాడతారు.

6.  ఇటాలియన్ భాష లాగానే   తెలుగు భాష లో కూడా  పదాలు హల్లు శబ్దం తో అంతమౌతాయని 16 వ శతాబ్దంలో ఇటలీ కి  చెందిన  నికోలో డీ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. అందుకే  తెలుగు భాషను ” ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్”. అని అంటారు .

7. భారత దేశంలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య సుమారు 75 మిలియన్లు.
ఇది మన దేశంలో మూడవ స్థానాన్ని, ప్రపంచం లో 15 వ స్థానం ను పొందింది.

8. తెలుగు అనే పదం త్రిలింగ అనే పదం నుండి వచ్చినట్లు చెపుతారు. హిందూ పురాణాల ప్రకారం  త్రిలింగక్షేత్రాలు నైజం ప్రాంతం లోని కాళేశ్వరం, రాయలసీమ లోని శ్రీశైలం, కోస్తా లోని భీమేశ్వరమ్ ల మధ్యలో వుండడం వలన ఈ పేరు వచ్చిందని అంటారు.

9. ప్రపంచ ఉత్తర ప్రాంతంలో తెలుగు భాష లో మాత్రమే ప్రతి పదం హల్లు శబ్దం తో పూర్తి అవుతుంది.

Hospital

10. తెలుగు భాష లో వున్న అన్ని సామెతలు, నుడికారాలు ఇంకా ఏ భాష లోను లేవు.

11. తెలుగు భాష ను పూర్వం తెనుంగు, తెలుంగు అని వ్యవహరించేవారు.

12. భారతీయ భాషలలో తెలుగు అంత తీయనైన భాష మరి ఏదీ లేదని విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ అన్నారు.

13. 200 సం. ల క్రితం మొక్కలు నాటే పని కోసం సుమారు 400 మంది తెలుగు వారు మారిషస్ వెళ్ళారు. ప్రస్తుత మారిషస్ ప్రధాని వారి సంతతే.

14. రామాయణ మహభారతాలలో అనేక పద్యాలు కఠిన పదాలతో, దీర్ఘసమాసాలతో కూడిన పద్యాలు వున్నాయి. ఈ విధంగా మరి ఏ భాష సాహిత్యం లో కూడా లేదు.
కచిక (palindrome words)పదాలు అనగా ఎటునుండి చదివిన వోకే రకంగా పలికేవి. ఉదాహరణకు వికటకవి, కిటికి, మందారదామం, మడమ వంటివి.

15. శ్రీకృష్ణ దేవరాయలు ఆముక్త మాల్యద అనే గ్రంథాన్ని తెలుగులో వ్రాసి, “దేశభాషలందు తెలుగు లెస్స” అని చెప్పి తెలుగు ను  తన సామ్రాజ్యం లో అధికార భాష గా చేసాడు.

16. ఏకాక్షర పద్యాలు గల భాష తెలుగు మాత్రమే.
తెలుగు భాష ఔత్సాహికులకు కావలసినంత ఉత్సాహాన్ని, సృజనాత్మకత ను అందిస్తుంది ఆనడం లో ఏమాత్రం సందేహం లేదు.

 

ఇంత గొప్ప మన భాషను మన భవి తరాలవారికి సగర్వంగా అందించే బాధ్యత మన తరం పై వుంది. ఏ భాష ప్రజలైన వారి మాతృ భాషలోనే మాట్లాడతారు. అందుకు వారు గర్వపడతారు. కానీ అది ఏమి దౌర్భాగ్యం, ఎక్కడినుండి వచ్చిన దరిద్రమో గానీ మనం మాత్రం ఆంగ్ల భాష లో మాట్లాడడానికి ప్రాధాన్యత ఇస్తాం. అమ్మ, నాన్న, అత్త, మామ, అన్నయ్య, అక్క, తాత, మామ్మ, వంటి పదాలు పలకడానికి సిగ్గు పడుతున్నాం. కొన్నాళ్ళకు ఆపదాలు అంతరించిపోయే విధంగా మనం ప్రవర్తిస్తున్నాం. ఇకనుంచి అయినా తెలుగు భాష పై స్వాభిమానం పెంచుకుందాం. తెలుగు లో మాట్లాడుదాం.

ఆంగ్లభాష బతుకుతెరువు కోసం నేర్చుకోవాలి. అందుకోసం మన తెలుగు భాష ను బలి చేయనవసరం లేదు. తెలుగు వారిగా పుట్టడం గర్వంగా, అదృష్టం గా అనుభూతి పొందుదాం.

తెలుగు భాషలో ఉన్న ప్రత్యేకతలు విశేషాలు
కొన్నితెలుసుకుందాం.
శ్లేష, ద్వ్యర్ధి కావ్యాలు, అవధాన ప్రక్రియలు, ఆశు కవితలు ఇలా ఎన్నెన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఆంధ్రత్వమాంధ్రభాషాచ నల్పస్య తపసః ఫలం
అని అప్పయ్య దీక్షితులు – ప్రఖ్యాత సంస్కృత పండితులు
ఏనాడో కీర్తించారు.
తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా భావం భాగ్యం చూసుకొని ఇక జీవన యానం చేయుదమా అంటూ కవులు తమ దేశభక్తిని చాటారు.
ఇలా ఇంకా అనేక విశేషాలు తెలుగుకే ప్రత్యేకమైనవి.

– పొదిల చూడామణి. విశ్రాంత ప్రధానాచార్యులు, సంస్కృత పండితులు హైదరాబాద్.

 

Leave A Reply

Your email address will not be published.