Read News in Telugu Language
adsdaksha

కాళోజీ అవార్డు అందుకున్న కవి జయరాజ్..

దక్ష న్యూస్, హైదరాబాద్ : సెప్టెంబర్ 9

పండుగ వాతావరణంలో జయంతి వేడుకలు ..

హర్షం వ్యక్తం చేసిన కవులు, కళాకారులు..

కాళోజీ నారాయణరావు ( kaloji narayana rao ) పేరిట తెలంగాణ ( telangana ) రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన అవార్డు కు కవి జయరాజ్ ( jayaraj ) ని ఎంపిక చేయటం ఎంతో ఆనందంగా ఉందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా ,పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ ( srinivas gaud )  అన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ అధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర భాష దినోత్సవం ( telangana bhasha dinotsavam ) సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ప్రజా కవి, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత కాళోజీ నారాయణరావు గారి 109 వ జయంతి వేడుకలు హైదరాబాద్ ( hyderabad ) లోని రవీంద్ర భారతి ( raveendra bharathi ) లో శనివారం ఘనంగా జరిగాయి.

read also : ఎస్సీ కులాల సహకార అభివృద్ధి కార్పోరేషన్’ చైర్మన్ గా ఏర్పుల నరోత్తమ్ ..

Hospital

ప్రభుత్వం అధికారికంగా ప్రతి సంవత్సరం సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో చేసిన కృషిని గుర్తిస్తూ ప్రతి యేటా అందించే కాళోజీ అవార్డు ఈ యేడాదికి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ సిఫారసులు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు కవి శ్రీ జయరాజ్ కి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, ప్రజా కవి, రచయిత జయరాజ్ సాహిత్య రంగానికి అందించిన సేవలను కొనియాడారు.

శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాష్ ముదిరాజ్ తో కలిసి మంత్రి ఈ అవార్ధును అందించారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత కు కాళోజీ నారాయణరావు అవార్డు తో పాటు 1 లక్ష 116 రూపాయల చెక్కు ను అందించి ఘనంగా సన్మానించారు.

read also : వెల్లువెత్తిన అభినందనలు.. పెల్లుబికిన ఆనందం..

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కెవి రమణ చారి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, రాష్ట్ర ప్రభుత్వ వివిధ కార్పొరేషన్ ల ఛైర్మన్ లు జూలూరి గౌరీశంకర్, తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర గ్రంధాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ అయాచితం శ్రీధర్, సంగీత నాటక అకాడమీ చైర్ పర్సన్ శ్రీమతి దీపికా రెడ్డి, భాష సంస్కృతిక అధ్యక్షులు మంత్రి శ్రీదేవి, పిసిసిబి ( pccb ) సభ్యులు సుమిత్ర, భాష సంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, ప్రముఖ సాహితీ వేత్త లు, కవులు, కళాకారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.