Read News in Telugu Language
adsdaksha

లోక్‌సభ ఎన్నికలకు బీఆర్‌ఎస్‌ నేటి నుంచి సన్నాహక సమావేశాలు..

దక్ష న్యూస్, హైదరాబాద్: జనవరి 3

బీఆర్‌ఎస్‌ పార్టీ గెలుపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహ రచనలకై, లోక్‌సభ నియోజకవర్గాల వారీగా బుధవారం నుంచి సన్నాహాక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాలు ఈ నెల 21 వరకు కొనసాగనున్నాయి. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ ( kcr ) ఆదేశాల మేరకు తెలంగాణ భవన్‌ ( telangana bhavan ) లో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు ( ktr ), పార్టీ సెక్రటరీ జనరల్‌ కే కేశవరావు, పార్టీ నేతలు హరీశ్‌రావు, కడియం శ్రీహరి, జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మధుసూధనాచారి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి తదితర ముఖ్యనాయకులు సమావేశాలను నిర్వహించనున్నారు.

read also : సంక్రాంతికి 32 స్పెషల్ రైళ్లు.. ఇవిగో వివరాలు..

రెండు విడతల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. మొదటి విడతలో జనవరి 3 నుంచి 12 వరకు నిర్వహిస్తారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో మూడు రోజులు సమావేశాలు జరగవు, తిరిగి జనవరి 16 నుండి మిగిలిన నియోజకవర్గాల సన్నాహక సమావేశాలు కొనసాగిస్తారు. మొదట ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ సమావేశం నిర్వహించనున్నారు.

Hospital

read also : అయోధ్య మహా సంప్రోక్షణ మహోత్సవానికి భారీ విరాళాలు ..

ప్రతిరోజూ ఒక లోక్‌సభ నియోజకవర్గం నాయకులతో సమావేశమై, పార్లమెంట్‌ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు. మీటింగ్‌కు హాజరయ్యే ముఖ్యనేతల అభిప్రాయాలు తీసుకుని కార్యాచరణను రూపొందిస్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.

read also : ఇక ప్రభుత్వ బడుల్లో ఫేస్ రికగ్నైజ్ అటెండెన్స్ ..ఆదేశాలు జారీ చేసిన విద్యాశాఖ

సమావేశాలకు ఆయా లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నేతలందరినీ ఆహ్వానించారు. ఎంపీలు, నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, జెడ్పీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మేయర్లు, మాజీ మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, నియోజకవర్గాల ఇన్‌చార్జీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు సమావేశాలకు హాజరుకానున్నారు.

Leave A Reply

Your email address will not be published.