Read News in Telugu Language
adsdaksha

కారు షెడ్ కి పోలేదట.. సర్వీసింగ్ కి మాత్రమే వెళ్ళిందట.. ఓటమిపై కేటిఆర్ వ్యాఖ్యలు..

దక్ష న్యూస్, హైదరాబాద్ : జనవరి 13

అందరికీ రైతుబంధు, కొందరికే దళిత బంధు ..ఇచ్చి తప్పు పెద్ద తప్పు చేశినం..

– మాజీ మంత్రి కేటిఆర్..

ఎట్టకేలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రియలైజ్ అయ్యారు. ఓటమికి కారణమైన నిజాలు ఒప్పుకున్నారు. శుక్రవారం తెలంగాణ భవన్ ( telangana bhavan ) లో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ ( ktr ).. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి గల కారణాలపై పోస్ట్ మర్టమ్ చేసే ప్రయత్నం చేశారు. అయితే తొలిసారి ఓటమి బాధ్యత తనపై వేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ( brs ) పార్టీ ఓటమికి తానే కారణమని అంగీకరించారు. అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ, ఓటమి విషయంలో నగ్నసత్యాలను తన నోటి తోనే ఒప్పుకొని పశ్చాత్తాపపడడం అందరినీ షాక్ కి గురిచేసింది.

రెండు దఫాలుగా తాము అధికారంలో ఉన్నా కార్యకర్తలను పట్టించుకోలేదని ఈ సందర్భంగా కేటిఆర్ రియలైజ్ అయ్యారు. భూ స్వాములకు రైతుబంధు ఇవ్వడానికి చిన్న రైతులు ఒప్పుకోలేదని తెలిపారు. ముఖ్యంగా దళిత బంధు కొందరికే రావడంతో… మిగిలిన వాళ్ళు వ్యతిరేకమయ్యారని చెప్పారు. దళిత బంధుపై ఇతర కులాల్లోనూ వ్యతిరేక కనిపించిందన్నారు. పథకాలపై ప్రజా వ్యతిరేకతను సరిగ్గా అంచనా వేయలేకపోయామని ఒప్పుకున్నారు.

Hospital

read also : అధికారులపై మంత్రి ఆగ్రహం.. కొనుగోళ్లలో జాప్యం చేయకూడదని ఆర్డర్స్..

ఓ వైపు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తూనే.. మరోవైపు కారు పనైపోలేదని.. కారు షెడ్ కు పోలేదు. నిర్విరామంగా పదేళ్ల పాటు కారు విరామం లేకుండా పనిచేసిందని గుర్తుచేశారు. మరింత స్పీడ్‌గా దూసుకెళ్లేందుకు ప్రస్తుతం సర్వీసింగ్‌కు వెళ్లిందని వ్యాఖ్యానించారు.

నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే కేంద్రంగా పార్టీని నడపడం సరికాదని కేటిఆర్ అన్నారు. పదేళ్లలో పార్టీ కార్యకర్తల ఆర్థిక పరిస్థితిని పట్టించుకోలేదని అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్‌ను ఓడించి ప్రజలు తప్పు చేశారని అక్కడక్కడా పార్టీ శ్రేణులు ప్రజలతో సంభాషిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని.. అలా మాట్లాడటం, ప్రజా తీర్పును గౌరవించకపోవడం కరెక్ట్ కాదని హితవు పలికారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి మొదలుకుంటే గడిచిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్‌కు బంపర్ మెజార్టీ ఇచ్చారని గుర్తుచేశారు. ఆ విషయాన్ని ఏ బీఆర్ఎస్ కార్యకర్త, నాయకుడు కూడా మర్చిపోవద్దని చెప్పారు.

read also : భద్రకాళీ సమేత వీరభద్రుడికి వెండి నాగాభరణం సమర్పించిన తాళ్లూరి జయశేఖర్ దంపతులు..

బీఆర్ఎస్‌ను ప్రజలు తిరస్కరించలేదని.. కేవలం కాంగ్రెస్‌కు ఒక అవకాశం ఇచ్చారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. గెలుస్తామనుకున్న 14 నియోజకవర్గాలు కూడా గెలిచి ఉంటే పరిస్థితి వేరుగా వుండేదని అభిప్రాయపడ్డారు.

Leave A Reply

Your email address will not be published.