Read News in Telugu Language
adsdaksha

కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు ఇస్తే తీవ్ర నష్టం : మాజీ సీఎం కేసీఆర్..

దక్ష న్యూస్, హైదరాబాద్: పిబ్రవరి 6

కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగిస్తే రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతుందని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ ( brs )  అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. 3 నెలల విరామం తర్వాత కేసీఆర్ ( kcr ) మంగళవారం తెలంగాణ భవన్ ( Telangana bhavan ) కు వచ్చారు. చాలా రోజులకు అధినేత పార్టీ కార్యాలయానికి వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారి తెలంగాణ భవన్ కు వచ్చిన ఆయనకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. జై తెలంగాణ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ జిల్లాల ప్రజాప్రతినిధులతో మాట్లాడిన కేసీఆర్ కృష్ణా జలాల పరిరక్షణ సభ ఏర్పాట్లపై సమీక్షించారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాలే బీఆర్ఎస్ కు ముఖ్యం అన్నారు. కృష్ణా బోర్డు (KRMB) పరిధిలోకి ప్రాజెక్టులు వెళ్తే రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందని గుర్తు చేశారు. చివరకు డ్యామ్ కు సున్నం వేయాలన్నా బోర్డు అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్నారు.

Read also: ప్రత్యేక అధికారుల పాలనలో ప్రజలకు స్పష్టమైన మార్పు కనిపించాలి..

Hospital

బీఆర్ఎస్ కు పోరాటం చేయడం కొత్త కాదని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించ వద్దనే మా పోరాటం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలివి లేదు. ఆ పార్టీ తీసుకున్న నిర్ణయం రైతుల సాగునీటి హక్కులకు గొడ్డలిపెట్టు లాంటిది. నల్గొండ జిల్లాలో ఈ నెల 13న భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తాం అన్నారు. రాష్ట్ర హక్కులు కాపాడేందుకు ఎంతకైనా పోరాడుతాం అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ప్రజాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడతాం అన్నారు. మరో ప్రజా ఉద్యమంతో తెలంగాణ ప్రజల హక్కులు కాపాడుతాం అని వెల్లడించారు.

Read also: భార‌త్ న్యాయ్ యాత్ర‌లో సీఎం రేవంత్ రెడ్డి.. రాహుల్ ను కలిసిన మంత్రులు భట్టి, పొంగులేటి..

నాడు ఉద్యమంతో తెలంగాణ సాధించుకున్న రీతిలోనే సాగునీటి హక్కుల కోసం పోరాడుతామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అనాలోచిత వైఖరి కృష్ణా బేసిన్ లోని దక్షిణ తెలంగాణ రైతాంగ సాగునీటి హక్కులపై గొడ్డలి పెట్టులా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ అవగాహన రాహిత్యం తో సంతకాలు చేసి తీసుకున్న నిర్ణయం వల్ల భవిష్యత్తులో ప్రాజెక్టుల కట్టలమీదికి కూడా పోలేని పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని ప్రజా మద్దతు తో తిప్పికొడతామని హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.