Read News in Telugu Language
adsdaksha

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సిట్టింగ్ లకే సీట్లు..

మధిరలో లింగాల.. భద్రాచలం లో తెల్లం లకు సీట్ల కేటాయింపు..

వైరాలో మదన్ లాల్ ని వరించిన అదృష్టం..

దక్ష న్యూస్, ఖమ్మం : ఆగస్ట్ 21
రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ఉమ్మడి ఖమ్మం ( khammam ) జాల్లా బిఆర్ఎస్ ( brs )  అభ్యర్ధుల పేర్లను సీఎం కేసిఆర్ ( cm kcr ) ప్రకటించారు. సోమవారం హైదరాబాద్  ( hyderabad ) తెలంగాణ భవన్ ( telangana bhavan ) లో నిర్వహించిన సమావేశంలో కేసిఆర్ తెలంగాణ వ్యాప్తంగా 119 స్థానాలకు 115 స్థానాల అభ్యర్ధుల పేర్లను ఖరారు చేశారు. ఇందులో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన 10 స్థానాలకు అభ్యర్ధుల పేర్లను ప్రకటించగా అందులో ఒక్క వైరా మినహా సిట్టింగ్ లకే సీట్లు దక్కాయి. మధిర ( madhira ) స్థానానికి లింగాల కమల్ రాజ్ ( lingala kamal raj ) , భద్రాచలం ( bhadrachalam ) కి తెల్లం వెంకటరావు ( tellam venkatarao ) లకు చోటు దక్కింది. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు స్థానాలు పెండింగ్ ఉంచారు. వాటిని రెండో లిస్ట్ లో ప్రకటించనున్నట్లు సీఎం తెలిపారు. తనకు తిరిగి ఖమ్మం సీటు కేటాయించడం పట్ల రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ( puvvada ajay kumar ) సీఎం కేసిఆర్ ని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

read also : బిఆర్ఎస్ టీమ్ సిద్దం.. ఏడుగురు సిట్టింగ్ లకు షాక్..

Hospital

మంత్రి పువ్వాడను మర్యాద పూర్వకంగా కలిసిన లింగాల కమల్ రాజ్.

రాష్ట్ర ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో మధిర ( madhira ) శాసనసభ స్థానానికి ప్రస్తుత జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ను ఖరారు చేయడంతో హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కి లింగాల కమల్ రాజ్ కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ని తన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో స్ధానిక ఎమ్మేల్యే, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ని ఖమ్మం నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిత్వాన్ని పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఖరారు చేయడం పట్ల మేయర్ పునుకొల్లు నీరజ, ఆర్ జే సి కృష్ణ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పువ్వాడ ను కలిసి మేయర్ పునుకొల్లు నీరజ, ఆర్జేసీ కృష్ణ మిఠాయి తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.