Read News in Telugu Language
adsdaksha

నూతన హై కోర్టుకు 100 ఎకరాల భూమి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ..

దక్ష న్యూస్, హైదరాబాద్: జనవరి 5

తెలంగాణ రాష్ట్రంలో హైకోర్టు పాత భవనం స్థానంలో నూతనంగా నిర్మించబోయే హైకోర్టు భవనం కోసం 100 ఎకరాల భూమిని కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. గత నెలలో సీఎంగా రేవంత్ రెడ్డి ( cm revanth reddy ) బాధ్యతలు చేపట్టిన తర్వాత హైకోర్టు  ( high court ) ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధేతో పాటు పలువురు న్యాయమూర్తులు ఎం సి హెచ్ ఆర్ డి లో ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ప్రస్తుతం ఉన్న హైకోర్టు భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో నూతన భవనాన్ని నిర్మించాలని వారు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. దాంతో స్పందించిన ప్రభుత్వం హైకోర్టు భవనం కోసం 100 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Hospital

read also :తెలంగాణ ఉద్యమకారులను గుర్తించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు ..

అదేవిధంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అనంతరం పెండింగ్లో ఉన్న పనుల పురోగతిపై దృష్టిసారించింది. ఈ క్రమంలోనే రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం ప్రేమావతి పేట్, బుద్వేల్ గ్రామం పరిధిలో ఉన్న 100 ఎకరాలను హైకోర్టు కోసం కేటాయిస్తూ జీవో నెంబర్.55 విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న హైకోర్టు భవనాన్ని కొత్త భవనం పూర్తయిన తదుపరి, సిటీ కోర్టుకు లేదా మరేదైనా కోర్టు భవనానికి వాడుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపినట్లు సమాచారం.

Leave A Reply

Your email address will not be published.