Read News in Telugu Language
adsdaksha

నంబర్ పోర్టబిలిటీలో కొత్త రూల్.. ట్రాయ్ కీలక నిర్ణయం ..

దక్ష న్యూస్, హైదరాబాద్ : మార్చి 19

మొబైల్ వినియోగదారుల కోసం టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ ( telecom regulatory authority of india ) కీలక నిర్ణయం తీసుకుంది. సిమ్ ( sim ) కార్డుల స్వాప్ మోసాలను నియంత్రించేందుకు మొబైల్ నంబర్ పోర్టబిలిటీలో కొత్త నిబంధనను తీసుకొచ్చింది. మొబైల్ నంబర్ మార్చకుండా ఇతర మొబైల్ నెట్‌వర్క్‌కు మారే విధానంలో సిమ్ కార్డు స్వాప్ లేదంటే రీప్లేస్ చేసిన వారం రోజుల వరకు ఇతర నెట్‌వర్క్‌కు మారడాన్ని నిలిపివేసింది. దీంతో సిమ్ కార్డుల స్వాప్ మోసాలకు చెక్ పెట్టినట్టయ్యింది.

Hospital

read also : ఇన్ఫోసిస్ నారాయణమూర్తి మనవడికి కాస్లీ గిఫ్ట్.. అత్యంత పిన్న వయసులోనే ఆస్తి రూ.240 కోట్లు..

ఈ ఏడాది జూలై 1 నుంచి కొత్త నిబంధన అమలులోకి వస్తుందని ట్రాయ్ క్లారిటీనిచ్చింది. ఈ నిబంధనల వల్ల ఎవరైనా ఒక వ్యక్తి సిమ్ కార్డు మార్చుకోవడం.. స్వాప్ చేసుకున్నప్పటికీ ఏడు రోజుల వరకు వేరే నెట్‌వర్క్‌కు మారడానికి కావాల్సిన యూనిక్ పోర్టింగ్ కోడ్(యూపీసీ) జారీ చేయరు. దీంతో కొత్త వ్యక్తి పేరుతో అదే నంబర్ తీసుకోకుండా మోసగాళ్లను అరికట్టేందుకు ఈ నిబంధన తీసుకొచ్చామని ట్రాయ్ స్పష్టం చేసింది.

Leave A Reply

Your email address will not be published.