Read News in Telugu Language
adsdaksha

బీఆర్‌ఎస్‌కు మరో భారీ షాక్‌ .. ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు కాంగ్రెస్ లో చేరిక..

దక్ష న్యూస్, హైదరాబాద్ : ఏప్రిల్ 7

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ ఎస్ పార్టీ తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు ( tellam venkatarao ) కాంగ్రెస్ లో చేరారు. దీంతో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యే సెగ్మెంట్లలో బీఆర్ఎస్ ( brs )  పార్టీ ఖాళీ అయింది. సీఎం రేవంత్ రెడ్డి ( cm revanth reddy ), మంత్రి పొంగులేటి  ( minister ponguleti ) సమక్షంలో వెంకట్రావ్ హస్తం పార్టీలో చేరారు.

Read also: రాజ్యాంగం కల్పించిన హక్కును కాలరాసే హక్కు ప్రభుత్వంలో ఏ శాఖకు లేదు.. హనుమకొండ లో సమాచార హక్కు చట్టం పై అవగాహన సదస్సు..

Hospital

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన వెంటనే సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌లను వెంకట్రావ్ కలిశారు. దీంతో అప్పటి నుంచి ఆయన కాంగ్రెస్‌లో చేరతారనే చర్చ సాగింది. అలాగే కొద్దిరోజుల క్రితం మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు నేతృత్వంలో జరిగిన మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతల సమావేశంలో కూడా ఎమ్మెల్యే తెల్లం కనిపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినా కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొని గెలుపు వ్యూహాలపై చర్చించడం గమనార్హం. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగసభ వేదికపై కూడా ఆయన కూర్చున్నారు.

Read also: పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి : జిల్లా కలెక్టర్ వి. పి. గౌతమ్..

అయితే ఇటీవలి కాలంలో తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో పలువురు నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. ఇక, పార్టీలో చేరిన వెంటనే టికెట్ దక్కడం విశేషం. కాగా, కొద్ది రోజులుగా తెల్లం వెంకట్రావ్ కాంగ్రెస్ నేతలతో టచ్ లో ఉన్న సంగతి తెలిసిందే.

Leave A Reply

Your email address will not be published.