Read News in Telugu Language
adsdaksha

తెల్లం వ్యవహారం తేటతెల్లం..

లైట్ తీసుకున్న శ్రీనివాస్ రెడ్డి..

ఎన్నికలు సమీపిస్తుండటంతో రాష్ట్రం లోని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. అయితే ఎన్నికల ప్రచారానికి సభలు మాత్రమే సరిపోవని భావించిన నాయకులు మైండ్ గేమ్ కి తెర లేర లేపుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రం లో మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ( ponguleti srinivas reddy ) జోష్ తో మొదట మైండ్ బ్లాక్ అయినా, అప్పట్లో రేవంత్ రెడ్డి చేసిన కరెంట్ వ్యాఖ్యలను ఆయుధాలుగా చేసుకొని అధికార పార్టీ గట్టెక్కింది. దానికి తోడు ఇటీవల ప్రకటించిన సంక్షేమ పధకాలు, గత ఎన్నికల హామీలు ఒక్కొక్క దానిపై దృష్టి పెట్టి గట్టెక్కేందుకు ప్రయత్నిస్తోంది.

read also : విద్యార్థులకు సదవకాశం..

రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్ ( brs) చాణక్య వ్యూహాలతో ఇప్పటికే ఎన్నికల రణరంగానికి గ్రౌండ్ వర్క్ సిద్దమైంది. మరో వారం రోజుల్లో అభ్యర్థుల ఎంపిక పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో అటు కాంగ్రెస్ ( congress) పార్టీ నియోజక వర్గాల్లో అభ్యర్థుల ఎంపిక కు దరఖాస్తుల స్వీకరణ చేపట్టింది. ఎవరి రాజకీయ వత్తిళ్ళకు తలోగ్గకుండా పారదర్శకంగా అభ్యర్ధులను ఎంపిక చేసే దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. అందుకు ఈనెల 18 నుండి 26 వరకు వారం రోజుల పాటు దరఖాస్తులు స్వీకరించి సర్వేల ఆధారంగా అభ్యర్థుల ఎంపికకు శ్రీకారం చుట్టనుంది. ఈ క్రమంలో ఉమ్మడి ఖమ్మం ( khammam) జిల్లాలో పొంగులేటి దూకుడుకు కళ్లెం వేసేందుకు అధికార పార్టీ మైండ్ గేమ్ స్టార్ట్ చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Hospital

read also : మై ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ దాతృత్వం..

తెల్లం పావుగా అధికారపార్టీ శ్రీనివాసరెడ్డి స్పీడ్ ని నిలువరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఒక వైపు రేవంత్ రెడ్డి ( revanth reddy )  వివాదాస్పద వ్యాఖ్యలు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రతిష్టను మసకబారుస్తుంటే.. మరోవైపు పొంగులేటి ని కట్టడి చేసే ప్రయత్నాల్లో భాగంగా భద్రాచలం ( bhadrachalam) లో తెల్లం వెంకటరావు ( tellam venkatarao) కి గాలం వేసినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న పొదెం వీరయ్య ( podem veeraiah) స్థానంలో తనకు సీటు దక్కేది కష్టమే అని భావించిన తెల్లం వెంకటరావు బి ఆర్ ఎస్ టికెట్ ఆఫర్ చేసే సరికి అటు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

తెల్లం ఆశలు ఫలించేనా..
కాంగ్రెస్ పార్టీ లో సిట్టింగ్ ఎమ్మెల్యే గా పొదెం వీరయ్య ఉండడంతో తనకు టికెట్ పై ఆశలు వదిలేసుకున్న తెల్లం వెంకటరావు బిఆర్ఎస్ టికెట్ ఇస్తామని ఆశ చూపడంతో మళ్లీ కారెక్కెందుకు సిద్ధమయ్యారు. అయితే వామపక్షాల తో బిఆర్ఎస్ కు పొత్తు కుదిరితే మాత్రం తెల్లం కు మొండి చెయ్యి చూపడం తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. తెల్లం వెంకటరావు హస్తానికి హ్యండిస్తున్నారని తెలిసినా తెల్లం ఆలోచన తేటతెల్లం కావడంతో పొంగులేటి పెద్దగా స్పందించడం లేదని తెలుస్తోంది. ఆయన పార్టీ మారడం పట్ల అక్కడ కాంగ్రెస్ పార్టీ కి జరిగే నష్టం పెద్దగా ఏం లేదని లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.