Read News in Telugu Language
adsdaksha

ఠారెత్తిస్తున్న ఎండలు.. 43డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత ..

దక్ష న్యూస్, హైదరాబాద్ : ఏప్రిల్ 5

రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో గురువారం 20 చోట్ల 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వీటిలో 14 ప్రాంతాల్లో 43 డిగ్రీల సెల్సియస్ దాటింది. నల్గొండ జిల్లా ఇబ్రహీంపేటలో అత్యధికంగా 43.5 డిగ్రీలు నమోదైంది. 2016 తర్వాత ఈ ఏడాదే ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలో వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా రెండు డిగ్రీలు అధికంగా నమోదవుతాయని తెలిపింది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని.. ఈ సమయంలో వృద్ధులు, పిల్లలు బయటకు రావద్దని వాతావరణ నిపుణులు సూచించారు.

Hospital

read also : కదం తొక్కుదాం.. కాంగ్రెస్ తడాఖా దేశానికి చాటుదాం..

అత్యధిక ఉష్ణోగ్రతలు :
నల్గొండ జిల్లా ఇబ్రహీంపేటలో 43.5 డిగ్రీలు, ఇదే జిల్లా కనగల్లో 43.4, గద్వాల జిల్లా వడ్డేపల్లి 43.3, నల్గొండ జిల్లా మాడ్గులపల్లి, గద్వాల జిల్లా ధరూర్, కుమురం భీం జిల్లా ఆసిఫాబాద్లలో 43.3 చొప్పున, నల్గొండ జిల్లా బుగ్గబావిగూడ, సంగారెడ్డి జిల్లా సదాశివపేటలలో 43.2 చొప్పున, నల్గొండ జిల్లా నాంపల్లి, గద్వాల జిల్లా ద్యాగదొడ్డి, ఆదిలాబాద్ జిల్లా అర్లి(టి), కుమురం భీం జిల్లా వంకులం, నల్గొండ జిల్లా నిడమనూరు, కట్టంగూరులలో 43.0 చొప్పున, నల్గొండ జిల్లా టీక్యా తండా, వనపర్తి జిల్లా పెబ్బేరులలో 42.9 చొప్పున, గద్వాల జిల్లా తిమ్మనదొడ్డి, నల్గొండ జిల్లా డిండి(గుండ్లపల్లి), భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో 42.8 చొప్పున, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం బయ్యారంలో 42.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Leave A Reply

Your email address will not be published.