Read News in Telugu Language
adsdaksha

త్వరలో టెట్ ఎగ్జామ్ .. డీఎస్సీకి ముందే టీచర్ ఎలిజిబిలిటి టెస్ట్..

దక్ష న్యూస్, హైదరాబాద్ : మార్చి 14

తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. డీఎస్సీకి ముందే టెట్ (ఉపాధ్యాయ అర్హ‌త ప‌రీక్ష‌) నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది. 11,062 ఉపాధ్యాయుల నియామ‌కానికిగానూ గ‌త నెల 29వ తేదీన రాష్ట్ర ప్ర‌భుత్వం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.

Hospital

read also : 18 ఓటీటీలు బ్యాన్ .. నిషేధం విధిస్తూ కేంద్ర సమాచార మంత్రిత్వశాఖ నిర్ణయం ..

డీఎస్సీ రాయాలంటే టెట్ త‌ప్ప‌నిస‌రి కావ‌డంతో మ‌రోసారి టెట్ నిర్వ‌హించాల‌ని అభ్య‌ర్థుల నుంచి విజ్ఞ‌ప్తులు రావ‌డంతో రాష్ట్ర ప్ర‌భుత్వం స్పందించింది. సాధ్య‌మైనంత త్వ‌ర‌గా టెట్ నిర్వ‌హించాల‌ని పాఠ‌శాల విద్యా శాఖ క‌మిష‌న‌ర్‌ను ప్ర‌భుత్వం ఆదేశించింది. రాష్ట్ర ప్ర‌భుత్వ తాజా నిర్ణ‌యంతో సుమారు మూడు ల‌క్ష‌ల మంది అభ్య‌ర్థుల‌కు ఊర‌ట ల‌భించ‌నుంది.

Leave A Reply

Your email address will not be published.