Read News in Telugu Language
adsdaksha

టెట్ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ ..

భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 15, దక్ష న్యూస్.. :

ఉపాధ్యాయ అర్హతకు నిర్వహించిన టెట్ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని భద్రాద్రి కొత్తగూడెం ( bhadradri kottagudem) జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల( priyanka ala )  తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ లక్ష్మీదేవిపల్లి మండలం, కృష్ణవేణి జూనియర్ కళాశాలలో టెట్ పరీక్ష కేంద్రాన్ని( tet exam centre )  ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పరీక్ష నిర్వహణకు 37 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మొదటి పేపర్ కు 8717, రెండో పేపర్ కు 6661 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా మొదటి పేపర్ కు 7307 మంది హాజరు కాగా 1410 మంది గైర్హాజరయినట్లు చెప్పారు. రెండో పేపర్ కు 6661 మంది హాజరుకావాల్సి ఉండగా 6131 మంది హాజరయ్యారని, 530 మంది గైర్హాజరయినట్లు తెలిపారు.

read also : ఉదయం నిద్ర లేవగానే చేతులు రుద్ది కళ్ళకు అద్దుకుంటారు..ఎందుకు…?

Hospital

పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. పరీక్ష సజావుగా, సక్రమంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా నిర్వహించడంలో భాగస్వాములైన
సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ప్రభుత్వ యంత్రాంగపు సలహాలు, సూచనలు పాటించి ప్రశాంతంగా వ్రాయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

read also : న్యూ శ్లోక స్కూల్ లో హిందీ దివస్ వేడుకలు..

జిల్లాలో 37 కేంద్రాలలో పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయగా, మొదటి పేపర్ ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, రెండో పేపర్ 2.30 నుంచి 5 గంటల వరకు పరీక్ష జరిగిందని చెప్పారు. మొదటి పేపర్ కు 37 కేంద్రాలు, రెండో పేపర్ కు 29 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష కేంద్రంలో అభ్యర్థుల హాజరు వివరాలను చీఫ్ సూపరింటెండెంట్ ను అడిగి తెలుసు కున్నారు.

 

Leave A Reply

Your email address will not be published.