Read News in Telugu Language
adsdaksha

3 నుండి తలసాని ట్రస్ట్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి వాలీ బాల్ టోర్నమెంట్..

దక్ష న్యూస్, సికింద్రాబాద్: అక్టోబర్ 1

ప్రజా జీవింతంలో ఎనలేని సేవలు అందిస్తున్న ప్రజా నాయకుడు, అభివృద్ధి ప్రదాత మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ( thalasani srinivas yadav ) జన్మదిన వేడుకలను అక్టోబర్ 6 వ తేదీన అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు బిఆర్ఎస్ ( brs ) పార్టీ సికింద్రాబాద్ ( secunderabad ) పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్ ( thalasani sai kiran yadav ) ప్రకటించారు. ఆదివారం మోండా మార్కెట్ ( monda market ) డివిజన్ లోని ఆదయ్య నగర్ లో గల గ్యాస్ మండి లోని వాలీ బాల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ నెల 3,4,5,6 తేదీలలో తలసాని ట్రస్ట్ ఆధ్వర్యంలో తలసాని చాలెంజ్ కప్ రాష్ట్ర స్థాయి వాలీ బాల్ టోర్నమెంట్ ను గ్యాస్ మండి లో గల వాలీ బాల్ గ్రౌండ్ లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

3 వ విడత డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ ..

3 వ తేదీన ఈ టోర్నమెంట్ ను స్పోర్ట్స్ చైర్మన్ ఆంజనేయ గౌడ్ ప్రారంభిస్తారని, 6 వ తేదీన పోటీలు ముగుస్తాయని తెలిపారు. ముందుగా టోర్నమెంట్ లో పాల్గొనే క్రీడాకారుల కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన జెర్సీ ల ను ఆవిష్కరించారు. కరోనా సమయంలో ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలను ఆదుకోవాలనే ఆలోచనతో తలసాని ట్రస్ట్ ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. వేలాది మంది పేదలకు తలసాని ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులను అందజేసి ఆదుకున్నట్లు వివరించారు.
క్రీడలను ప్రోత్సహించే విధంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాపోటీలకు ఎంపికైన వైష్ణవి, సింధూతేజస్వి, కిరణ్, వంటి క్రీడాకారులకు అనేక విధాలుగా తమ ట్రస్ట్ ద్వారా చేయూతను అందించినట్లు తలసాని సాయి కిరణ్ యాదవ్ తెలిపారు. ప్రతి సంవత్సరం క్రికెట్ టోర్నమెంట్ ను కూడా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వాలీబాల్ టోర్నమెంట్ ను కూడా ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ టోర్నమెంట్ లో మెన్స్ 6, ఉమెన్స్ 5 మొత్తం 11 టీం లు పాల్గొంటున్నాయని వివరించారు. రోజుకు 5 మ్యాచ్ లు నిర్వహించబడతాయని చెప్పారు.

Hospital

read also : సాగర్ సరసన లేక్ ఫ్రంట్ పార్క్.. ఆదివారం నుంచి అనుమతి..

టోర్నమెంట్ చివరి రోజు 6 వ తేదీన టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు, మరికొందరు సినీ ప్రముఖులు కూడా హాజరు కానున్నారని సాయికిరణ్ యాదవ్ తెలిపారు. విజేతలకు ట్రోఫీ తో పాటు నగదు బహుమతులను కూడా అందజేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వాలీబాల్ కోచ్ నందు, సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ, మోండా మార్కెట్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అద్యక్షులు ఆకుల హరికృష్ణ, నాయకులు నాగులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.