Read News in Telugu Language
adsdaksha

సెప్టెంబర్ 2 నుండి జీహెచ్ఎంసీ పరిధి లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ..

దక్ష న్యూస్, హైదరాబాద్ ఆగస్టు 19

సెప్టెంబర్ 2 నుండి జీహెచ్ఎంసీ ( ghmc) పరిధి లో నిరు పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ చేపట్టనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ( thalasani srinivas yadav ) తెలిపారు.
డాక్టర్ BR అంబేడ్కర్ తెలంగాణ ( telangana) రాష్ట్ర సచివాలయంలోని తన చాంబర్ లో GHMC కమిషనర్, కలెక్టర్ ల తో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ పై శనివారం మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ,
మొదటి విడతలో 8 ప్రాంతాలలో 12 వేల మంది అర్హులకు ఇండ్లు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.

read also : బిజెపి నేత త్వరలో బిఆర్ఎస్ లోకి .. కేటీఆర్ హరీష్ రావు లతో భేటీ

Hospital

ఈ నెల 24 న హైదరబాద్ జిల్లా కలెక్టరేట్ లో డ్రా పద్దతిలో లబ్దిదారుల ఎంపిక జరుగుతుందన్నారు. పేద ప్రజలు గొప్పగా, ఆత్మగౌరవంతో బ్రతకాలనేది ముఖ్యమంత్రి KCR లక్ష్యం అని అందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని సౌకర్యాలతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఉచితంగా అందజేస్తున్నారన్నారు.

read also : 26 న రాష్ట్ర వ్యాప్తంగా నాటనున్న కోటి మొక్కలు.. సీఎస్ శాంతి కుమారి..

Leave A Reply

Your email address will not be published.