Read News in Telugu Language
adsdaksha

రాజదానిలో వార్డు ఆఫీస్ లు .. ప్రారంభించిన మంత్రి తలసాని..

దక్ష న్యూస్, హైదరాబాద్: ఆగస్ట్ 30

ప్రజలు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన తమ సమస్యల పరిష్కారం కోసం వేరు వేరు ప్రాంతాలకు చెందిన ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా వార్డుల్లోనే వార్డు కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ( thalasani srinivas yadav ) వెల్లడించారు. బుధవారం సనత్ నగర్ ( sanathnagar ) నియోజకవర్గ పరిధిలోని ఎంజీ (MG) రోడ్డు లో రాంగోపాల్ పేట డివిజన్ వార్డు ఆఫీస్, ముషీరాబాద్ ( musherabad ) యోజకవర్గ పరిధిలోని భోలాక్ పూర్ లో స్ధానిక MLA ముఠా గోపాల్ ( muta gopal ) తో కలిసి వార్డు ఆఫీస్, అంబర్ పేట నియోజకవర్గ పరిధిలోని తిలక్ నగర్ ( thilak nagar ) లో స్థానిక MLA కాలేరు వెంకటేష్ ( kaleru venkatesh ) తో కలిసి వార్డు ఆఫీస్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశ్యంతోనే త్వరితగతిన సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వం GHMC ఆధ్వర్యంలో వార్డు ఆఫీసులను ఏర్పాటు చేసిందని తెలిపారు.

read also : సమాచార మంత్రికి టీడబ్ల్యూజేఎఫ్ నేతల అభినందనలు ..

వార్డు ఆఫీస్ వ్యవస్థ వలన GHMC పరిధిలోని ఎలక్ట్రికల్, శానిటేషన్, టౌన్ ప్లానింగ్, హార్టికల్చర్ తదితర శాఖల అధికారులు అంతా ఒక్క చోట ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అధికారులు కూడా ప్రజల నుండి వచ్చే సమస్యలపై సకాలంలో స్పందించి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటారని చెప్పారు. GHMC పరిధిలోని 150 డివిజన్ లలో డివిజన్ కు ఒకటి చొప్పున గతంలో 137 వార్డు ఆఫీసులను ప్రారంభించడం జరిగిందని, మిగిలిన 13 ఆఫీసులను ఈరోజు ప్రారంభించి ప్రజలకు అందుబాటులో కి తీసుకొచ్చినట్లు వివరించారు.

Hospital

read also : మమత ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి పువ్వాడ..

ప్రజల సౌకర్యార్థం, ప్రజలకు మేలు చేసే ఉద్దేశం తో దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆధ్వర్యంలో వార్డు ఆఫీసులను ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి తలసాని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజల ఇబ్బందులు, అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

read also : సెప్టెంబర్ 1 న స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకలు .. హాజరవనున్న సి.ఎం కేసీఆర్ ..

Leave A Reply

Your email address will not be published.