Read News in Telugu Language
adsdaksha

గణపతి నిమజ్జనానికి ఘనంగా ఏర్పాట్లు : మంత్రి తలసాని

దక్ష న్యూస్, హైదరాబాద్ సెప్టెంబర్ 28

అధికారులతో హెలికాప్టర్ లో ఏరియల్ వ్యూ..

తెలంగాణ ( Telangana ) ప్రభుత్వం పండుగలు, ఉత్సవాల విశిష్టతను పెంపొందించే విధంగా ఏర్పాట్లను చేస్తూ ఘనంగా నిర్వహిస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ( thalasani srinivas yadav ) తెలిపారు. గణేష్ నిమజ్జనం సందర్బంగా ఆయన నగరంలోని పలు ప్రాంతాలలో పర్యటించి శోభాయాత్ర నిమజ్జనాన్ని పరిశీలించారు. ముందుగా ఖైరతాబాద్ ( khairathanad ) వినాయకుడి శోభాయాత్రలో పాల్గొన్నారు. అనంతరం చార్మినార్, మోజం జాహి మార్కెట్, ఆబిడ్స్, లిబర్టీ, తెలుగుతల్లి ఫ్లై ఓవర్ ల వద్ద శోభాయాత్ర గా వస్తున్న విగ్రహాలకు స్వాగతం పలికారు. అనంతరం హుస్సేన్ సాగర్ లో బోట్ లో తిరుగుతూ నిమజ్జనాన్ని పర్యవేక్షించారు.

Hospital

మధ్యాహ్నం బేగంపేట ఎయిర్ పోర్ట్ నుండి హెలికాప్టర్ లో హోంమంత్రి మహమూద్ అలీ, DGP అంజనీ కుమార్, పోలీస్ కమిషనర్ CV ఆనంద్, GHMC కమిషనర్ లోకేష్ కుమార్ లతో కలిసి ఏరియల్ వ్యూ ద్వారా నగరంలో గణేష్ విగ్రహాల శోభాయాత్ర, హుస్సేన్ సాగర్ వద్ద నిమజ్జనాలు జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మీడియా తో మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో నిర్వహించే గణేష్ ఉత్సవాలకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. గణేష్ శోభాయాత్ర, నిమజ్జనాల సందర్బంగా వచ్చే లక్షలాది మంది భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు ప్రభుత్వం వివిధ శాఖల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పారు. ఈ సంవత్సరం నగరంలోని వివిధ ప్రాంతాలలో సుమారు 90 వేల విగ్రహాలను ఏర్పాటు చేశారని తెలిపారు. శుక్రవారం ఉదయం వరకు నిమజ్జనాలు కొనసాగే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా వీక్షించే 68 అడుగుల ఎత్తుగల ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం మద్యాహ్నం వరకే పూర్తయిందని, భక్తుల అభీష్టం మేరకు ప్రభుత్వం అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసిందని వివరించారు.

Read also : గృహలక్ష్మి సీఎం కేసిఆర్ మానస పుత్రిక : మంత్రి పువ్వాడ అజయ్ కుమార్..

ఎంతో ఉత్సాహంగా భక్తులు విగ్రహాల నిమజ్జన శోభాయాత్రను నిర్వహిస్తున్నారని మంత్రి తెలిపారు.  పోలీసు, టూరిజం, వాటర్ వర్క్స్, ఎలక్ట్రికల్, హెల్త్ తదితర శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారని అన్నారు. నగరానికి చెందిన పోలీసు అధికారులు, సిబ్బందే కాకుండా ఇతర జిల్లాల నుండి కూడా తీసుకొచ్చి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అంతేకాకుండా ప్రత్యేకంగా CC కెమెరాలను ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్ ద్వారా శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో, గొప్పగా నిర్వహించే విధంగా ప్రభుత్వ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని చెప్పారు

Leave A Reply

Your email address will not be published.