Read News in Telugu Language
adsdaksha

తల్లడిల్లిన తండాల కు మహర్దశ.. మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ..

దక్ష న్యూస్, హైదరాబాద్: సెప్టెంబర్ 23

తెలంగాణ కు ముందు సౌకర్యాల లేమితో తల్లడిల్లిన తండాలకు తెలంగాణ ( telangana ) వచ్చాక మహర్దశ పట్టిందని రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ‌ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ( errabelli dayakar rao ) అన్నారు. ప్రతి తండాను గ్రామ పంచాయతీ గా మార్చిన ఘనత సీఎం కెసిఆర్ ( cm kcr ) దే అన్నారు. శనివారం పాల‌కుర్తి ( palakurthi ) నియోజ‌క‌వ‌ర్గం లో మంత్రి విస్తృతంగా పర్యటించారు. గ్రామపంచాయతీ నూతన భవనాలకు, సిసి రోడ్లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వివిధ దేవాలయాలకు నిర్మాణాలకు శంకుస్థాపనలు చేస్తూ మంత్రి దేవరుప్పుల మండ‌లంలో తండా బాట ( thandabata ) నిర్వ‌హించారు. మండ‌లంలోని దుబ్బ తండా, లకావత్ తూర్పు తండా, దేవుని గుట్ట తండా, పొట్టి గుట్ట తండా, లక్ష్మణ్ తండా, సిత్య తండా, పడమటి తండా, లకావత్ తండా లలో మంత్రి విస్తృతంగా పర్యటించారు.

ఈ సందర్భంగా ఆయా తండాల్లో వేర్వేరుగా జరిగిన సభలలో మంత్రి దయాకర్ రావు మాట్లాడారు. తెలంగాణ కు ముందు తండాలు సౌకర్యాల లేమితో తల్లడిల్లేవని కనీస వసతులు లేక గిరిజనులు ఇబ్బందులు పడ్డారన్నారు. తెలంగాణ తర్వాత, కెసిఆర్ సీఎం అయ్యాక తండాలకు మహర్దశ వచ్చిందన్నారు. ప్రతి తండాను గ్రామ పంచాయతీ గా మార్చిన ఘనత సీఎం కెసిఆర్ దే అని వ్యాఖ్యానించారు. అలా 3,146 తండాలు, గూడాలను గ్రామ పంచాయతీలుగా మార్చినట్లు వెల్లడించారు. గ్రామాలకు దీటుగా గిరిజన తండాల అభివృద్ధి పరచిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే అని, ఒక్కో తండాకు రూ.కోటి తో అభివృద్ధి జరిగిందన్నారు.

read also : 27 న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక….మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

నిజానికి కాంగ్రెస్ వల్లే తండాలకు కష్టాలు వచ్చాయని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. ముందు చూపు లేని కాంగ్రెస్ పాలన ప్రజలకు శాపంగా మారిందని, అందుకే కాంగ్రెస్ కు ప్రజలు చరమ గీతం పాడారన్నారు. ఇంకా కాంగ్రెస్ వచ్చేది లేదు ఇచ్చేది లేదు. ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచిన ఘనత కేసిఆర్ ది అయితే, అదే ఎస్ టి లలో వర్గీకరణ చిచ్చుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతున్నదన్నారు. తండాలకు వచ్చే ఆ పార్టీ నాయకులను తరిమికొట్టండి అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.

Hospital

గిరిజనుల ఏండ్ల గోసను ఎడబాపింది కేసీఆరే అని మంత్రి ఎర్రబెల్లి స్పష్టం చేశారు. ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచిన ఘనత కేసిఆర్ దే అని గ్రామాలకు దీటుగా గిరిజన తండాల అభివృద్ధి చేసిన చరిత బి అర్ ఎస్ దే 3 గంటల కరెంటు కావాలా? 3 పంటల కరెంటు కావాలా? తేల్చుకోండి అంటూ…. మంత్రి గిరిజనులకు హితవు పలికారు.

ఒక్కో గ్రామానికి కోటి రూపాయలతో అనేక అభివృద్ధి పనులతో సంక్షేమ కార్యక్రమాలతో గతంలో కనీవినీ ఎరగని రీతిలో తండాలను సైతం గ్రామాలకు ధీటుగా అభివృద్ధి పరచిన ఘనత చరిత సీఎం కేసీఆర్ గారికి దక్కుతుందన్నారు. గతంలో ఎప్పుడైనా ఇంత అభివృద్ధి జరిగిందా? ఆలోచించుకోవాలని మంత్రి సూచించారు.

read also : ప్రతి పేదవానికి స్వంత ఇంటి కల నెరవేర్చే దిశగా చర్యలు..మంత్రి పువ్వాడ

ఈ సందర్భంగా మంత్రికి తండావాసులు ప్రత్యేకించి మహిళలు సంప్రదాయ పద్ధతుల్లో డప్పు చప్పుళ్ళు, నృత్యాలతో బతుకమ్మలతో ఎదురేగి, కుంకుమ తిలకం దిద్ది, ఎడ్ల బండి పై ఊరేగిస్తూ, బైక్ ర్యాలీ నిర్వహిస్తూ, మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి బతుకమ్మలను ఎత్తుకున్నారు. గిరిజనుల కోరిక మేరకు బైకు ర్యాలీ లో పాల్గొన్నారు. ఎడ్ల బండి ఎక్కి తండాల్లో పర్యటించారు.

ఈ తండా బాట, అభివృద్ధి కార్య‌క్రమాల్లో అడిషనల్ కలెక్టర్ సుహాసిని, ఆయా తండాల ప్ర‌జ‌లు, స్థానిక‌ ప్ర‌జాప్ర‌తినిధులు, సంబంధిత శాఖ‌ల అధికారులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.