Read News in Telugu Language
adsdaksha

ఖమ్మంలో కమలం వికసిస్తుంది : ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు..

దక్ష న్యూస్, ఖమ్మం : మే 15

ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా భారతీయ జనతా పార్టీ గెలుపును ఎవరు ఆపలేరని ఖమ్మం ( khammam ) లో కూడా కమలం వికసిస్తుందని బిజేపి ( bjp ) ఎంపీ ( mp ) అభ్యర్థి తాండ్ర వినోద రావు అన్నారు. ఖమ్మం నగరంలోని 25, 26, 37, 39, డివిజన్ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఖమ్మం పార్లమెంటరీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి తాండ్ర వినోద రావు ( thandra vinod rao ) ఆత్మీయ సమావేశము నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ తాండవినోద రావు మాట్లాడుతూ ఖమ్మంలో కూడా కమలం వికసిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తనకు ఓటేసిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని అన్నారు. ఒక్క అవకాశం వస్తే ఖమ్మం జిల్లా ప్రజలకు ఎల్లవేళలా తన సేవలు అందిస్తానని పేర్కొన్నారు.

Hospital

read also : వేసవి సెలవుల్లో ఆబాల గోపాలాన్ని అలరిస్తున్న తాజ్ మహల్ ఎగ్జిబిషన్..

జిల్లా అధికార ప్రతినిధి మారుతి వీరభద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తాండ్ర వినోద రావు సతీమణి శ్రీమతి వినీలా లక్ష్మీ కుమారి, సీనియర్ నాయకులు గెంట్యాల విద్యాసాగర్, మందా సరస్వతి , బోయినపల్లి చంద్రశేఖర్, పిల్లలమర్రి వెంకటనారాయణ, నరేష్, డీకొండ శ్యాంసుందర్, చింతమల్ల వీరస్వామి, దాసరి మధుసూదన్ రావు, డోకుపర్తి రవీంద్ర కుమార్, కొంకిమళ్ళ మృత్యుంజయ రావు, పోలిశెట్టి పద్మావతి, సోడే ధర్మేందర్, ధారా శ్యాము, రామారావు, గోలి ఫణి కుమారి , మన్యం నాగమణి , బండారు శ్రీనివాసరావు, ఆకుల మురళి, చౌడవరపు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.