Read News in Telugu Language
adsdaksha

ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేసి చూపిస్తా : బిజెపి ఎంపీ అభ్యర్ధి వినోద్ రావు..

దక్ష న్యూస్, తల్లాడ : మే 6

ఖమ్మం జిల్లా ప్రజలంతా భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారని తాండ్ర వినోద్ రావు ( thandra vinod rao ) అన్నారు. జిల్లాలో ఏ పట్టణానికి వెళ్లిన ఏ ప్రాంతానికి వెళ్లిన ఏ పల్లెకు వెళ్లిన ఏ వాడకు వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. భారతీయ జనతా పార్టీ ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ ఆదివారం రాత్రి తల్లాడ ( thallada ) లో రోడ్ షో నిర్వహించారు. మిత్రపక్షాలైన ఎమ్మార్పీఎస్ తెలుగుదేశం పాల్గొన్నఈ కార్యక్రమంలో అభ్యర్థి తాండ్ర వినోద రావు పాల్గొన్నారు.

Read also: బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ కాదు : కుర్ణవల్లి రోడ్ షో లో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ అభ్యర్థి అయిన నాకు అఖండమైన రీతిలో ప్రజలు యువత రైతులు రైతు కూలీలు స్వాగతం పలుకుతూ ఈ ఈసారి మీరే రావాలి మీరే గెలవాలని నన్ను ఎంతగానో ఈ ఖమ్మం ( khammam ) జిల్లా వాసులు ఆదరిస్తున్నారన్నారు. ఈ ఆదరణ చూస్తుంటే నేను గెలిచినట్లేననిపిస్తోందని అన్నారు.

ఖమ్మం జిల్లాలో ఎందరికో ఇప్పటివరకు ఓట్లు వేసి అందరు అభ్యర్థుల్ని మీరు గెలిపించారు. ఒక్కసారి నన్ను గెలిపించమని వినోద్ రావు విజ్ఞప్తి చేశారు. ఈ జిల్లా వాసిని మీ బిడ్డను.. నేను ఈ ఖమ్మం జిల్లా అభివృద్ధికి పాటు పడతా అన్నారు. వ్యవసాయం, విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాలను అభివృద్ధి చేస్తానని యువతకు ఉద్యోగ కల్పనలో సహాయపడతానని హామీ ఇచ్చారు. ఈ దేశంలో నరేంద్ర మోడీ సైనికుడు వలె పని చేస్తానని ఆయన సామాన్య కార్యకర్త నుంచి దేశ ప్రధాని అయ్యాడని నేను కూడా సామాన్యుడనని మీ సేవ చేయటానికి వచ్చిన మోదీ సైనికుడినని పేర్కొన్నారు.

Hospital

Read also: 7న ఖమ్మానికి విక్టరీ వెంకటేష్ రాక : తుంబూరు దయాకర్ రెడ్డి..

ఖమ్మం జిల్లా అభివృద్ధి దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలంటే ఒక్కసారి నన్ను దీవించాలని విజ్ఞప్తి చేశారు.

వ్యవసాయంలో సారవంతమైన భూములు కలిగిన వ్యవసాయమే జీవనంగా ఉన్నటువంటి ఈ జిల్లాలో వ్యవసాయాన్ని పట్టించుకోని గత పాలకులు ఈ జిల్లాని ఎలా విస్మరించారో అర్ధం కావడం లేదన్నారు. ఏ రంగమైనా అభివృద్ధి చెందిందా మీకు తెలుసు కదా ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు ఏర్పడ కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారెంటీల పేరుతో ప్రజల్ని మోసం చేస్తుందని తెలిసింది కదా.. వారి గ్యారెంటీలలో రైతులకు రుణమాఫీ ఇచ్చిందా రైతులకు రైతు భరోసా ఇచ్చిందా యువతకు నిరుద్యోగ భృతి ఇచ్చిందా మహిళలకు చేయూతనిచ్చిందా వృద్ధులకు పెన్షన్ పెంచిందా ఏం చేసింది ఈ ప్రభుత్వం 100 రోజులలో గారడి మాటలతో ప్రభుత్వం నడిపిస్తుంది తప్ప వారు హామీలు అమలు పరచడం లేదు కదా ఆలోచించాలన్నారు. అలాంటి గారడి మాటలకు మోస పోవద్దని అభివృద్ధి కాంక్షితుడు నవభారత నిర్మాత అయిన నరేంద్ర మోడీ అభ్యర్థి అయిన నేను మీ అభివృద్ధి కోసం అహర్నిశలు తాపత్రయపడి మీ అభివృద్ధి మన ఖమ్మం జిల్లా అభివృద్ధిని చేస్తానని ఒక్కసారి మీ దీవెనలు ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థిస్తూ నన్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఆపతి వెంకట రామారావు పార్లమెంటరీ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వర రావు, ఎమ్మార్పీఎస్ నాయకులు అశోక్, వెంకటేశ్వరరావు, గుడ్లా వెంకట్ రత్నం జిల్లా కార్యదర్శి నాయుడు రాఘవరావు, మిశ్రా రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మట్టా ప్రసాద్ జిల్లా స్పోర్ట్స్ పర్సన్ పడిగల మధుసూదన్ రావు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు చావా కిరణ్ తల్లాడ ఎంపీటీసీ చల్లా తిరుమల దేవి జిల్లా కార్యవర్గ సభ్యులు చల్లా నాగులు జిల్లా గిరిజన మోర్చా నాయకులు తేజావత్ బాలాజీ నాయక్ మండల ప్రధాన కార్యదర్శి గాద కృష్ణారావు మండల ఉపాధ్యక్షురాలు నన్నపనేని శారద, నాయకులు తొండపు మధుసూదన్ రావు గొల్లమందల నరేష్, వాడవల్లి నాగేశ్వరరావు, చౌడా నాగేశ్వరరావు, రాయల రమేష్ ఎల్లంకి సుధాకర్, కట్కూరి రవితేజ, పెరిక కిరణ్ చల్ల నరేష్ తమ్మిశెట్టి కృష్ణ చల్ల వెంకటి రాము వేముల వెంకటనారాయణ గాదె నరసింహారావు నరేష్ రాయప్ప సత్తుపల్లి నియోజకవర్గ నాయకులు జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.