Read News in Telugu Language
adsdaksha

బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. కారు దిగిన స్టేషన్ ఘన్ పూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య..

దక్ష న్యూస్, హైదరాబాద్: ఫిబ్రవరి 3

పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో అట్టర్ ప్లాప్ అయిన ఆ పార్టీని వీడేందుకు తాజా, మాజీ ఎమ్మెల్యేలు పోటీపడుతున్నారు. ఇందులో భాగంగా స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ( thatikonda rajaiah ) కూడా గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు లేఖను మీడియాకు విడుదల చేశారు. అనంతరం ఆయన కాంగ్రెస్ గూటికి చేరబోతున్నట్లు వెల్లడించారు.

Read also: ప్రజావాణిలో 10 స్పెషల్ కౌంటర్లు.. నెక్ట్స్ వీక్ నుంచే అమలు ..

Hospital

ఈ సందర్భంగా మీడియాతో రాజయ్య మాట్లాడుతూ బీఆర్ఎస్ లో మానసిక క్షోభకు గురయ్యాను.. పార్టీలో నాకు సరైన గుర్తింపు లభించడం లేదు. పార్టీ అధినాయకత్వాన్ని కలిసే అవకాశమే దక్కడం లేదు. కార్యకర్తల నుంచి ఒత్తిడి ఉంది. వారితో చర్చించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటాను అన్నారు. పార్టీ విధివిధానాలు నచ్చట్లేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తామనడం సరికాదు అని విమర్శించారు. తాను 15 ఏళ్లు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను. కాంగ్రెస్ పార్టీలో ఉండి తెలంగాణ కోసం పోరాడాను అని గుర్తు చేశారు. బీఆర్ఎస్ కు క్షేత్రస్థాయిలో ఆదరణ కరువైంది. ఇక మున్ముందు ఆ పార్టీకి మరింత గడ్డుకాలం తప్పదు. ఏ పార్టీలో చేరబోయేది త్వరలో ప్రకటిస్తా. నా అనుచరులు, సామాజిక వర్గ నేతలతో మరోసారి మట్లాడాలి అని రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read also: ఖర్గే, పీయూష్ మధ్య వార్.. రాజ్యసభలో హాట్ హాట్ గా చర్చ..

కాగా, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ నెల 10వ తేదీన కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.