Read News in Telugu Language
adsdaksha

ప్రవాసుల సంఘర్షణలకు, అస్త్తిత్వవేదనకు అద్దం పట్టిన నిశాంత్‌ ఇంజమ్‌..

దక్ష న్యూస్, హైదరాబాద్: సెప్టెంబర్ 9

– జూలూరు గౌరీశంకర్, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్..

రెండు దేశాల సంస్కృతులు, సామాజిక సంబంధాల మధ్య జరిగే సంఘర్షణను రచయిత నిశాంత్‌ ఇంజమ్‌ ( nishanth injam ) శక్తివంతమైన కథలుగా మలిచారని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ జూలూరు గౌరీ శంకర్‌ ( juluri gauri shankar ) అన్నారు. ఆదివారం హైదరాబాద్ ( hyderabad ) లోని రవీంద్ర భారతి ( raveendra bharathi ) సమావేశ మందిరంలో నిశాంత్‌ ఇంజమ్‌ రాసిన ‘ది బెస్ట్‌ పాజిబుల్‌ ఎక్స్‌పీరియన్స్‌ ( the best possible experience )  కథల సంపుటిని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ జూలూరు గౌరీశంకర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రవాసుల సంఘర్షణలను, అస్త్తిత్వవేదనను ఆంగ్లంలో అద్భుతంగా కథలుగా మలిచిన నిశాంత్‌ రచనలు తెలంగాణ ( telangana ) కు గర్వకారణమన్నారు.

read also : travel: ట్రావెల్ అండ్ టూరిజం ఫెయిర్ .. ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్..

నిశాంత్‌ కథల సంపుటి ద్వారా తెలంగాణ ప్రాంత చైతన్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పారని జూలూరు గౌరీశంకర్ పేర్కొన్నారు. అమెరికాలో నివసిస్తున్న నిశాంత్‌ తెలంగాణ నేలతో తన అనుబంధాన్ని, అనుభూతులను, ప్రవాస జీవన అనుభవాలను ఆంగ్లంలో కథలుగా రాశారని తెలిపారు. ఈ కథల సంపుటిని అమెరికాలోని ప్రఖ్యాత ప్రచురణా సంస్థ ముద్రించి ప్రపంచానికి నిషాంత్‌ రచనలను పరిచయం చేయటం అభినందించదగినదని చెప్పారు. భవిష్యత్‌లో మన దేశానికే పేరు తెచ్చే ప్రఖ్యాత రచయితగా నిశాంత్ ఎదుగుతారన్న విశ్వాసాన్ని జూలూరు వ్యక్తం చేశారు.

రచయిత నిషాంత్‌తో ‘ది బెస్ట్‌ పాసిబుల్‌ ఎక్స్‌పీరియన్స్‌’ పుస్తకం పై పలువురు సాహితీవేత్తలు చర్చ జరిపారు. ఈ చర్చా కార్యక్రమానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ కొండా నాగేశ్వరరావు సమన్వయ కర్తగా వ్యవహరించారు. ఈ సందర్భంగా సాహితీవేత్త శ్రీధల స్వామి, ప్రముఖ రచయిత్రి పింగళి చైతన్య అడిగిన ప్రశ్నలకు నిషాంత్‌ జవాబిస్తూ తన అనుభవాల ఆధారంగా కథలు రాసినట్లు వివరించి చెప్పారు. ఈ పుస్తకంలో పదకొండు కథలు వున్నాయని అందులో ఆరు కథలు ప్రవాస జీవితానికి సంబంధించిన కథలని తెలిపారు. మరో ఐదు కథలు మానవ సంబంధాలు ఉద్వేగాలను తెలియజేస్తూ సాగిన కథలుగా విశ్లేషించి చెప్పారు.

Hospital

read also : కాళోజీ అవార్డు అందుకున్న కవి జయరాజ్..

ప్రవాసులు కుటుంబ సభ్యులతో కలిసి గడిపే జీవితాన్ని కోల్పోతారని, వాళ్ళు పోగొట్టుకున్న కుటుంబ జీవితాలను కేవలం జ్ఞాపకాలలో నిక్షిప్తం చేసుకుని, ఆ అనుభూతులతో తృప్తి పడతారని, కాని ఆ వెలితి ఎన్నటికీ పూరించలేనిదని తెలిపారు. తన రచనలు ఎంతోకొంత భారతీయ సమాజంపై ప్రభావం చూపిస్తే తన రచనలకు సార్ధకత చేకూరినట్లేనని, అందుకే ఈ మట్టిపై ఈ పుస్తకాన్ని ఆవిష్కరించుకుంటున్నానని అన్నారు.

రచయిత్రి పింగళి చైతన్య మాట్లాడుతూ నిశాంత్‌ రాసిన కొన్ని కథలు దు:ఖాన్ని కలిగించాయని తెలిపారు. సాధారణంగా ఇతర దేశాలకు వెళ్ళినవారు రాసే పద్ధతులకు భిన్నంగా మానవ సంబంధాలను సున్నితంగా స్పృశించారని చెప్పారు.

read also : యాసే కాదు భాష మధురం..

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కార్యాలయ ప్రజా సంబంధాల అధికారి వనం జ్వాలా నర్సింహారావు, సామాజిక విశ్లేషకులు ఐ.వి. రమణరావు, తెలంగాణ సాహిత్య అకాడమి సెక్రటరీ నామోజు బాలాచారి, సీనియర్‌ జర్నలిస్ట్‌ పాశం యాదగిరి, తెలంగాణ బుక్‌ట్రస్ట్‌ కార్యదర్శి కోయ చంద్రమోహన్‌, కొండపల్లి పావన్‌ జర్నలిస్ట్‌ నెల్లూరు నర్సింహారావు, కొండూరి వీరయ్య, జతిన్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.