Read News in Telugu Language
adsdaksha

సదువుకున్నోళ్ళ తీన్‌మార్ .. ప్రకటించిన మొదటి ప్రాధాన్యత ఓట్లు.. ఆధిక్యంలో తీన్మార్ మల్లన్న.. చెల్లని ఓట్లు 7728.

దక్ష న్యూస్, నల్గొండ : జూన్ 6

ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ నిర్విరామంగా కొనసాగుతోంది. బుధవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలయినా, మొత్తం ఓట్లను ఫస్ట్ ప్రయారిటీ వారీగా లెక్కించి బండిల్స్ కట్టేందుకు సాయంత్ర వరకు పట్టింది. అనంతరం మొదటి ప్రాధానత్య ఓట్ల లెక్కింపును చేపట్టారు. ఈ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపునకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ( theenmar mallanna ) తొలి రౌండ్‌లో ఆధిక్యం దిశగా దూసుకెళ్లారు. తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి ఎనుగుల రాకేష్ రెడ్డిపై 7,670 ఓట్ల ఆధిక్యాన్ని కనబరిచారు.

ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ కోసం ఈ సారి 96 టేబుల్స్ ఏర్పాటు చేశారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు 4 రౌండ్లలో పూర్తయింది. అయితే ఈ నాలుగు రౌండ్లకు సంబంధించి మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఫలితం తేలనట్టయితే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును చేపడతారు. ఇదిలావుంటే.. అర్ధరాత్రి సమయానికి అధికారికంగా తొలిరౌండ్ ఫలితం ప్రకటించారు. తొలిరౌండ్ ఫస్ట్ ప్రయారిటీ ఓట్లలో తీన్మార్ మల్లన్న స్పష్టమైన మెజార్టీతో ఉన్నారు. తర్వాత రౌండ్ లోను ఇదే తరహాలో ఆధిక్యం కొనసాగే పరిస్థితి కన్పిస్తోంది.

మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిలకు సంబంధించి మొత్తం పోలైన ఓట్లలో 51 శాతం ఓట్లు సాధించకపోతే సెకండ్ ప్రయారిటీ ఓట్లను లెక్కించే అవకాశం ఉంది. మొదటి ప్రయారిటీ ఓట్లలో అధిక శాతం తీన్మార్ మల్లన్నకు పడినట్టు సమాచారం. మరోవైపు మొదటి ప్రాధాన్యత ఓట్లలో చెల్లని ఓట్లు రికార్డు స్థాయిలో పడినట్టు తెలుస్తోంది.

read also : ప్రధాని పదవికి మోడీ రాజీనామా.. చివరిసారిగా మోడీ నివాసంలో సమావేశం ..హాజరైన బాబు, పవన్..

గంటల కొద్దీ సాగుతున్న కౌంటింగ్ ప్రక్రియ..

Hospital

ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్‌ ప్రక్రియ సుధీర్ఘంగా సాగనుంది. నాలుగు హాళ్లలో 96 టేబుళ్లపై 3,36,013 ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఈ ఓట్లను బ్యాలెట్‌ బాక్సుల వారీగా తీసుకొచ్చి ఓపెన్‌ చేసి 25 ఓట్లను ఒక బండిల్‌గా కట్టారు. బండిల్స్‌ కట్టే ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. తర్వాత మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. పోలైన ఓట్లలో చెల్లని ఓట్లను తీసేసి, చెల్లిన ఓట్లు లెక్కిస్తారు. చెల్లిన ఓట్లను పరిగణలోకి తీసుకుని 50 శాతంపైన ఒక్క ఓటు వచ్చిన అభ్యర్థిని గెలిచినట్లుగా ప్రకటిస్తారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో అలా రాకపోతే రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. 2021 ఎమ్మెల్సీ ఎన్నికల్లో అప్పటి బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి సెకండ్ ప్రయారిటీ ఓట్లతోనే విజయం సాధించిన సంగతి తెలిసిందే.

తొలి ప్రాధాన్యత ఓట్ల ఫలితాలు..

మొదటి రౌండ్ :

బీజేపీ – 11395 – (ప్రేమెందర్ రెడ్డి),
కాంగ్రెస్ – 36210 (తీన్మార్ మల్లన్న)
, బీఆర్ఎస్ – 28540 (రాకేష్ రెడ్డి),
అశోక్ కుమార్ – 9019.

చెల్లిన ఓట్లు – 88369
చెల్లని ఓట్లు – 7728.

Leave A Reply

Your email address will not be published.