Read News in Telugu Language
adsdaksha

Theenmar mallanna : మల్లన్న గెలుపు లాంఛనమే.. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ లో ఎలిమినేట్ అయిన బీజేపీ అభ్యర్థి…

దక్ష న్యూస్, నల్గొండ : జూన్ 7

నల్లగొండ – వరంగల్ – ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ఉత్కంఠంగా సాగుతోంది.
ఇప్పటికే 49 మంది అభ్యర్థులు ఎలిమినేట్ కాగా ఇప్పుడు బిజెపి అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఎలిమినేషన్ తో ఆ  సంఖ్య 50కి చేరింది.

అంతిమంగా కౌంటింగ్ బరిలో 51వ అభ్యర్థిగా బీఆర్ఎస్ అభ్యర్థి.. 52వ అభ్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థి నిలిచారు.

అయినప్పటికీ 50 శాతం కోటా ఓట్లు ఎవరికీ దక్కక పోవడంతో కౌంటింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. దాంతో ఇప్పుడు
కోటా ఓట్ల కోసం బీఆర్ఎస్ అభ్యర్థి ఎలిమినేషన్ అనివార్యం అయింది.

దాదాపు కాంగ్రెస్ అభ్యర్ధి తీన్మార్ మల్లన్న విజయం ఖరారు కావడంతో కాంగ్రెస్ శ్రేణులు..తీన్మార్ మల్లన్న అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు.

ప్రేమేందర్ రెడ్డి ఎలిమినేషన్ తో 19 వేల ఆధిక్యంలో మల్లన్న..

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు లో తొలి ప్రాధాన్య ఓట్లలో అధికార కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్నకు, ప్రతిపక్ష భారాసకు చెందిన ఏనుగుల రాకేశ్‌రెడ్డి గట్టి పోటీ ఇచ్చారు..

పోటీలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్ధి తీన్మార్ మల్లన్న, బీఆర్ ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి..

Hospital

• దాదాపు 15 వేల ఓట్ల ఆధిక్యం లో ఉన్న తీన్మార్ మల్లన్న

• అయినా గెలుపు కోట కు కావాల్సిన ఓట్లు రాకపోవడం తో రాకేష్ రెడ్డి  ఎలిమినెట్

• రాకేష్ రెడ్డి ని ఎలిమినేట్ చేస్తున్నట్లు ప్రకటించి అధికారులు

*_గెలుపు లాంఛనం దిశగా తీన్మార్ మల్లన్న_*

• గెలుపు కోట కి చేరుకునేంత వరకు కొనసాగనున్న ఓట్ల లెక్కింపు

• 11 గంటల వరకు పూర్తి కానున్న లెక్కింపు

• తీన్మార్ మల్లన్న కి గెలుపు కన్ఫర్మ్ కావడం తో  భారీగా కౌంటింగ్ సెంటర్ వద్దకు చేరుకున్న కాంగ్రెస్ క్యాడర్, మల్లన్న అభిమానులు

• బాణసంచాలు కాలుస్తూ సంబరాలు ప్రారంభించిన కాంగ్రెస్ క్యాడర్

Leave A Reply

Your email address will not be published.