Read News in Telugu Language
adsdaksha

ప్రశ్నకు పట్టాభిషేకం.. జర్నలిజానికి జన నీరాజనం.. ఎమ్మెల్సీగా కలం యోధుడు తీన్మార్ మల్లన్న..

దక్ష న్యూస్, హైదరాబాద్ : జూన్ 7

పదేళ్ళ తెలంగాణ అరిగోసను ప్రశ్నిస్తున్న జర్నలిజానికి పట్టభద్రులు నీరాజనం పట్టారు. ప్రశ్నకు పట్టాభిషేకం చేస్తూ పట్టభద్రులు తమ ప్రతినిధిగా కలం యోధుడు తీన్మార్ మల్లన్న ( theenmar mallanna )  ను చట్టసభలకు పంపించేందుకు రాచమార్గం పరిచారు. తమ కలలకు ఆశలకు ఆకాంక్షలకు ప్రతినిధిగా మల్లన్నను మరో యుధ్దానికి సిద్దం చేసి నూతన ఆవిష్కరణకు పురుడు పోశారు. పాత్రికేయుడెప్పుడూ ప్రజల మనిషే అని కలానికి తమ గళాలను జతకట్టి పోరాట యోధుడు మల్లన్నను మరో మల్ల యుద్ధానికి సిద్దం చేశారు.

 

మూడు రోజుల ఉత్కంఠానికి తెర పడింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఎట్టకేలకు శుక్రవారం రాత్రి వరకు సాగి రెండో ప్రాధాన్యత ఓటు రెండో రౌండ్ వద్ద విజేతను ప్రకటించేందుకు మార్గం సుగమం అయింది. మూడు రోజుల నిర్విరామ కౌంటింగ్ అనంతరం తీన్మార్ మల్లన్నను అధికారులు విజేత ప్రకటించారు. దాంతో ఫలితాల కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కాంగ్రెస్ శ్రేణులు, తీన్మార్ మల్లన్న అభిమానులు పట్టరాని ఆనందంతో కేరింతలు కోట్టారు. బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. పట్టభద్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. టీవీల వద్ద, సెల్ ఫోన్ లల్లో ఫలితాల కోసం ఎదురు చూసిన వారు మల్లన్న గెలుపు వార్త వినగానే షోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ ఉప్పొంగుతూ అభిమానం వెల్లువలా ముంచెత్తుతోంది.

పదేళ్ళ కష్టానికి ప్రతిఫలం..

Hospital

క్యూ న్యూస్ ద్వారా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టి గత పదేళ్ళుగా నాటి టిఆర్ఎస్ పాలనను ఎండగడుతూ వస్తున్న తీన్మార్ మల్లన్న తన ప్రశ్నతో అప్పట్లో సంచలనం సృష్టించారు. స్వరాష్ట్ర సాధన కోసం ఝళిపించిన కలానికి పాలకుల వైఖరిని ఎండగట్టడంలో తన గళాన్ని జోడించి యువ జర్నలిస్ట్ లకు స్పూర్తి గా నిలిచారు. అంతే కాదు నాటి టిఆర్ఎస్ నిరంకుశ పాలనను ప్రశ్నించడానికి ప్రతిపక్షాలు సైతం వెనుకంజ వేసిన సమయంలో తీన్మార్ మల్లన్న ప్రాణాలకు సైతం తెగించి పాలకులకు ఎదురెళ్ళి జైలు జీవితాన్ని అనుభవించారు. అయినా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో చావుకు ఎదురెళ్ళి మరీ క్యూ న్యూస్, తన మానసిక పుత్రిక శనార్తి తెలంగాణ పత్రిక ద్వారా ప్రశ్నను బతికిస్తూ జర్నలిజానికే వన్నె తెచ్చారు. అంతే కాదు కాన్సిరాం స్పూర్తితో రాజకీయాల్లో సైతం అడుగుపెట్టి గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో నైతిక విజయాన్ని సాధించి రాజకీయాల్లోను కొత్త ఒరవడి సృష్టించారు. తన ఆస్తులను ప్రభుత్వానికి అప్పగించడం.. రీకాల్ విధానాన్ని ప్రజల్లోకి తేవడం ద్వారా పట్టభద్రులను ఆలోచింపజేశారు.

Read also: Theenmar mallanna : మల్లన్న గెలుపు లాంఛనమే.. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ లో ఎలిమినేట్ అయిన బీజేపీ అభ్యర్థి…

నీళ్ళు నిధులు నియామకాలు ప్రాతిపదికన ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో పీడిత వర్గాలుగా మారిన ప్రజలకోసం తన జీవితాన్ని సైతం పణంగా పెట్టి పోరాడిన తీన్మార్ మల్లన్న యుద్దం మిగిలే ఉంది అంటూ జనాన్ని జాగృతం చేశారు. నాటి నుండి నేటి వరకు ప్రజల ఆకాంక్షలను తన గళంతో వినిపించేందుకు చట్టసభలకు వెళ్ళడానికి చేయని ప్రయత్నం లేదు. అందులో భాగంగా పలు పార్టీలు మారాల్సి వచ్చినా తన లక్ష్యసాధన కోసం ఎన్నో అవమానాలు, అవహేళనలు దిగమింగి సైతం తన లక్ష్యాన్ని సాధించిన తీన్మార్ మల్లన్నకు ఇప్పడు జనం నీరాజనాలు పడుతున్నారు. అధికార పార్టీలో ఉన్నా ప్రజల మనిషి మల్లన్న ప్రజల ఆకాంక్షల మేరకే పనిచేస్తాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.