Read News in Telugu Language
adsdaksha

theenmar mallanna : గూడేల్లో కేసీఆర్ ఎయిర్ అంబులెన్సులు ఏమయ్యాయి.. తీన్మార్ మల్లన్న..

దక్ష న్యూస్, అచ్చంపేట: నవంబర్ 22

గువ్వల కథలన్నీ నా దగ్గరున్నయ్..

అచ్చంపేటలో గుండాగిరికి ఇక చెక్..

– కాంగ్రెస్ ప్రచార కమిటీ కన్వీనర్ తీన్మార్ మల్లన్న..

గువ్వల బాలరాజు ( guvvala balaraju ) కథలన్నీ నా దగ్గర ఉన్నాయని, అచ్చంపేట ( achhampet ) లో ఆయన గుండాగిరి ఇక చెల్లబోదని కాంగ్రెస్ ( congress ) ప్రచార కమిటీ కన్వీనర్ తీన్మార్ మల్లన్న ( theenmar mallanna ) అన్నారు. అచ్చంపేటలో బుధవారం కాంగ్రెస్ అభ్యర్థి చిక్కుడు వంశీకృష్ణ ( chikkudu vamshekrishna ) ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో పాల్గొని మాట్లాడారు. గువ్వల బాలరాజు ఇసుకను అక్రమంగా కొల్లగొట్టి రూ.కోట్లు సంపాదించాడన్నారు. అచ్చంపేట అంటేనే గిరిజన బిడ్డల ఇలాకా అని, కోయాగూడాల్లో ఉండేటోళ్లకి కేసీఆర్ ( kcr ) ఎయిర్ అంబులెన్సులు పెడతానని చెప్పిండు. మరీ వాటి సంగతి ఏమైందని ప్రశ్నించారు. అచ్చంపేటలో గువ్వల అనుచరులు చిచ్చులు రేపుతున్నారని, ఇప్పుడు ఇబ్బంది పెట్టే పోలీసులను వంశీకృష్ణ ఎమ్మెల్యే అయ్యాక వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు.

Hospital

read also : బిసి బిడ్డలు కుటుంబాలకు దూరంగా బతుకుతున్నారు : డాక్టర్ కె.వి. కృష్ణారావు..

కేసీఆర్ మద్యం దుకాణాలను విపరీతంగా పెంచారని, రైతు బంధు పుట్టించిందే నేను అని చెబుతున్నాడని మల్లన్న అన్నారు. మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అడ్డుపడింది ఎవరని నిలదీశారు. అచ్చంపేటలో అవినీతి ఎక్కువయ్యిందని, ఇసుక దందా జోరుగా సాగుతుందని తెలిపారు. తెలంగాణలో ఒక్క నోటిఫికేషన్ సక్రమంగా జరగలేదని, మద్యం నోటిఫికేషన్ మాత్రం సజావుగా సాగిందని చెప్పారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలు తీసుకువస్తుందని, అది మనకు శ్రీరామ రక్ష అని పేర్కొన్నారు. కార్నర్ మీటింగ్‌కు వచ్చిన ప్రజలను రేషన్ కార్డులు వచ్చినయా..? మూడెకరాల భూమి వచ్చిందా..? మరీ బీఆర్ఎస్‌కు ఎందుకు ఓటేయాలి..? అని అడిగారు.

read also : కూనంనేని లాంటి నేతలు తోడుంటే కొత్తగూడెం అభివృద్ధి బాట పట్టిస్తా ..

ఈనెల 30న కాంగ్రెస్ అభ్యర్థి చిక్కుడు వంశీకృష్ణకు ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని తీన్మార్ మల్లన్న కోరారు. అనంతరం కాంగ్రెస్ అభ్యర్థి చిక్కుడు వంశీకృష్ణ మాట్లాడుతూ.. అచ్చంపేటలో గుండాగిరి నడుస్తోందన్నారు. నటనలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పోటీ పడితే ఆస్కార్ అవార్డు రావడం ఖాయమని చెప్పారు. సోనియా ఇచ్చిన తెలంగాణను ఒక్క కుటుంబం మాత్రమే దోచుకుతింటుందని, ఈసారి కాంగ్రెస్ వస్తుందని, మీ బాధలన్నీ తీరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గువ్వల హటావో.. అచ్చంపేట బచావో అని నినదించారు. కార్యక్రమంలో అన్ని మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.