Read News in Telugu Language
adsdaksha

గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల .. మే 27న పోలింగ్.. జూన్‌ 5న కౌంటింగ్

దక్ష న్యూస్, హైదరాబాద్ : ఏప్రిల్ 26

ఖమ్మం-వరంగల్-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక షెడ్యూల్ ను ఈసీ గురువారం విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన తేదీలను ప్రకటించింది. మే 2న నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపింది. మే 9 నుండి నామినేషన్ల స్వీకరణ, మే 10న నామినేషన్ల పరిశీలన, మే 13న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా పేర్కొంది. మే 27వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తామని పక్రటించింది. జూన్‌ 5వ తేదీన కౌంటింగ్‌ నిర్వహించి.. ఫలితాలు వెల్లడిస్తామని ఈసీ షెడ్యూల్ లో పేర్కొంది.

Hospital

వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఎన్నికైన బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నియోజకవర్గంలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఆయన… గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఈ ఉపఎన్నిక అనివార్యమైంది. 2021 మార్చి 14న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక జరగగా… ఇండిపెండెంట్ గా బరిలో నిలిచిన తీన్మార్ మల్లన్న గట్టి పోటీ ఇచ్చారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి, తీన్మార్ మల్లన్న మధ్య హోరాహోరీ పోరు నడిచింది. దాంతో కాంగ్రెస్ అధిష్టానం పట్టభద్రుల్లో అత్యంత పాలోయింగ్ సంపాదించుకున్న తీన్మార్ మల్లన్న పేరును పరిగణలోకి తీసుకొని టికెట్ ఖన్ఫార్మ్ చేసింది.

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్న ( theenmar mallanna ) పేరును ఖరారు చేసి ఇందుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనేది ఇంకా తేలాల్సి ఉంది. గతంలో ఈస్థానం నుంచి అత్యంత కష్టం మీద గెలిచిన బీఆర్ఎస్ ఈ సారి గెలవటం అంత సులువు కాదనే చర్చ జోరుగా సాగుతోంది. పట్టభద్రుల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న తీన్మార్ మల్లన్నే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గెలుస్తారనే ధీమా సర్వత్రా వ్యక్తమవుతోంది.

Leave A Reply

Your email address will not be published.