Read News in Telugu Language
adsdaksha

ఏపీ తరహాలో తెలంగాణలోను వాలంటీర్ వ్యవస్థ.. ప్రతీ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలు ఉండేలా ప్రభుత్వ చర్యలు : తీన్మార్ మల్లన్న..

దక్ష న్యూస్, ఖమ్మం : ఏప్రిల్ 28

గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం వల్ల ప్రైవేట్ టీచర్స్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ ( congress ) పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ( theenmar mallanna ) అన్నారు. తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం ఆధ్వర్యంలో ఆదివారం ఖమ్మం ( khammam ) ఎస్ఆర్ కన్వెన్షన్ లో నిర్వహించిన కార్యక్రమానికి మల్లన్న ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రైవేట్ టీచర్స్ సహకారం మరువలేనిదన్నారు. మీ అందరి చొరవ సహకారం వల్లే బిఆర్ఎస్ పార్టీని ఇంటికి పంపించగలిగామన్నారు. తెలంగాణ ( telangana ) రాష్ట్రంలో టీచర్స్ అంటే కార్పొరేట్ విద్యాసంస్థల టీచర్స్ మాత్రమే కాదన్నారు. వారి కుటుంబాలకు ఆపద వస్తే ఆదుకునేందుకు సరైన పాలసీలు లేవన్నారు.

read also : చరిత్రలో నిలిచిపోయేలా టియుడబ్ల్యూజే రాష్ట్ర మహాసభలు .. నివాస స్థలాలు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే యూనియన్ లక్ష్యం ..

ప్రైవేట్ టీచర్స్ హక్కుల కోసం పోరాడడం గొంతెమ్మ కోర్కెలు కావని, ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేసే వారి సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వ పాలసీలు ఉండాలని తీన్మార్ మల్లన్న అన్నారు. తెలంగాణలో ప్రభుత్వం మెగా డిఎస్సీ ప్రకటించబోతోందని మల్లన్న తెలిపారు. నిరుద్యోగుల ఉద్యోగ కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అన్నారు.

Hospital

ఏపీలో వాలంటీర్ సిస్టం లా తెలంగాణలోను త్వరలో మహిళలకు వాలంటీర్ శిక్షణలు ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు మల్లన్న తెలిపారు. ప్రతీ ఇంట్లో మహిళ సంతోషంగా ఉన్నప్పుడే ఆ ఇల్లు ప్రశాంతంగా ఉంటుందని ఇట్లోని వారంతా ఆనందంగా ఉంటారన్నారు. అందుకే సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని వాలంటీర్ వ్యవస్థలో మహిళలకే అవకాశం ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించేలా ప్రతీ గ్రామంలో ప్రభుత్వం పాఠశాలలు ఉండేలా చర్యలు తీసుకోబోతోందన్నారు. తద్వారా ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయన్నారు.

read also : రాహుల్ గాంధీతోనే సుపరిపాలన సాధ్యం : సత్తుపల్లి నియోజకవర్గ సమావేశంలో మంత్రి పొంగులేటి ..

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని తీన్మార్ మల్లన్న కోరారు. ప్రైవేట్ టీచర్స్ సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం ఎల్లవేలలా ఉంటుంన్నారు. కార్యక్రమంలో టిపిటిఎఫ్ నాయకులు, వివిధ విద్యాసంస్థల టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.