Read News in Telugu Language
adsdaksha

రాష్ట్ర మంత్రులను కలిసిన తీన్మార్ మల్లన్న .. పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపించాలని కార్యకర్తలకు మంత్రుల పిలుపు..

దక్ష న్యూస్, హైదరాబాద్ : మే 17

ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఉమ్మడి జిల్లాల కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గా పోటీ చేస్తున్న ప్రముఖ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న ( theenmar mallanna ) శుక్రవారం రాష్ట్ర వ్యసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర నీటిపారుదలా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ఐటీ, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఆశీర్వదించాలని, భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా మల్లన్న కోరారు. అందుకు స్పందించిన మంత్రులు కేసులకు బెదరకుండా.. పేద ప్రజల కోసం కొట్లాడిన తీన్మార్ మల్లన్నను భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు మంత్రులు పిలుపునిచ్చారు.

Hospital

read also : మారోజు వీరన్న స్వగ్రామంలో ఖమ్మం నాయకుల ఘన నివాళులు..

ఎమ్మెల్సీ అభ్యర్ధిగా తీన్మార్ మల్లన్న ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. మల్లన్నకు మూడు ఉమ్మడి జిల్లాల పట్టభద్రులు సంపూర్ణ మద్దతు పలుకుతున్నారు. దీంతో మల్లన్న గెలుపు ఇప్పటికే ఖాయమైందనే చెప్పాలి. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్లన్నను గెలిపించుకోలేక పోయామని బాదపడుతున్న పలు సంఘాలు ఇప్పుడు మల్లన్న కు సంపూర్ణ మద్దతు ప్రకటించి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని తీర్మానించుకోవడం తో తీన్మార్ మల్లన్న గెలుపు నల్లేరుమీద నడకే అని పలువురు నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.