Read News in Telugu Language
adsdaksha

Theenmar Mallanna : తీన్మార్ మల్లన్న ను భారీ మెజారిటీతో గెలిపించాలి : జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్..

దక్ష న్యూస్, ఖమ్మం: మే 18

ఈ నెల 27 న జరగనున్న ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న తీన్మార్ మల్లన్న కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వా ళ్ళ దుర్గా ప్రసాద్ కోరారు. మండల కాంగ్రెస్ అధ్యక్షులతో శుక్రవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

Read also: నేడే కేబినెట్ భేటీ..రుణమాఫీ నిధుల సమీకరణపై జరగనున్న చర్చ.. పునర్విభజన అంశాలపై నిర్ణయం..

Hospital

ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… ప్రశ్నించే గొంతుక నిత్యం ప్రజల సమస్యలపై పోరాడే వ్యక్తి,గత ప్రభుత్వంలో జరిగిన అరాచకలను ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచి నిజమైన జర్నలిస్టుగా ప్రజలకు వివరించిన తీన్మార్ మల్లన్న ను కాంగ్రెస్ పార్టీ గుర్తించి, ఖమ్మం నల్గొండ వరంగల్,కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా అధిష్టానం నియమించడం చాలా సంతోషకరమైన విషయం అని అన్నారు. దీనిలో భాగంగానే ఈనెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మండల కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు ప్రతి గ్రామంలో ఉన్న పట్టభద్రులను గుర్తించి ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడు కార్యకర్త సైనికుల వలే పనిచేస్తూ తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఎమ్మెల్సీ ఓట్లు వేసే విధంగా సహకరించాలని దిశా నిర్దేశం చేశారు. ప్రతి మండలంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో,అనుబంధ సంఘ అధ్యక్షులతో, ముఖ్య నాయకులతో, గ్రామ కాంగ్రెస్ నాయకులతో సమావేశాలు నిర్వహించి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సన్నద్ధం చేయాలని కోరారు.

Read also: ఒరిస్సాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విస్తృత ప్రచారం ..

ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురంశెట్టి కిషోర్, గాలి దుర్గారావు, కొమ్మినేని భూక్యా బాలాజి, మాలోత్ మంగిలాల్ నాయక్, తలారి చంద్రప్రకాష్, స్వర్ణ నరేందర్, కాపా సుధాకర్, శివ వేణు, కాసర చంద్రశేఖర రెడ్డి తదితర మండల అద్యక్షులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.