Read News in Telugu Language
adsdaksha

ప్రశ్నించే గొంతును చట్టసభలకు పంపాలి : సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి..

దక్ష న్యూస్, సత్తుపల్లి : మే 22

సాయి వెంకట్ మొగుదుంపురం, నెట్ వర్క్ ఇంచార్జ్:

గత పదేళ్లకు పైగా నియంతృత్వ బి ఆర్ ఎస్ పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలిచిన ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్న ( theenmar mallanna ) ను చట్టసభలకు పంపాల్సిన అవసరం ఉందని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ అన్నారు. బుధవారం సత్తుపల్లి పట్టణం – లక్ష్మి ప్రసన్న ఫంక్షన్ హల్ లో నిర్వహించిన ఖమ్మం, వరంగల్ నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయాన్ని కాంక్షిస్తూ సత్తుపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

Hospital

Read also: నేడు సత్తుపల్లి లో తీన్మార్ మల్లన్న ఆత్మీయ సమావేశం..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి మాట్లాడుతూ పట్టభద్రుల తీన్మార్ మల్లన్న కు మొదటి (1) ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీ తో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ ప్రజల పక్షాన కొట్లడినందుకే గత ప్రభుత్వం తనను జైల్లో పెట్టిందన్నారు. అంతమాత్రం చేత తన ప్రశ్నించే తత్త్వాన్ని ఒదులుకోలేదని తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ప్రజల కొరకు పోరాడుతూనే ఉంటానన్నారు. తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

Read also: ప్రపంచంతో పోటీ పడేలా ఆరు నూతన పాలసీలు : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…

కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ , ఖమ్మం జిల్లా పార్లమెంట్ అభ్యర్థి రామసహాయం రఘు రాం రెడ్డి, కో ఆర్డినేటర్ రావుల నాగేశ్వరావు, సత్తుపల్లి పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్ సుజల రాణి, పట్టణ కౌన్సిలర్స్, సిపిఐ, సిపిఎం నాయకులు, సత్తుపల్లి నియోజకవర్గం 5 మండలాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు విద్యావంతులు, ఉద్యోగులు, విశ్రాంతి ఉద్యోగులు, పట్టభద్రులు, వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.