Read News in Telugu Language
adsdaksha

గెలుపు గుర్రానికి చెల్లని ఓట్ల కళ్లేలు.. మొదటి ప్రాధాన్యతా ఓట్లలో ముందంజలో ఉన్న తీన్మార్ మల్లన్న.. విసుగు తెప్పిస్తున్న అభిమానుల అత్యుత్సాహం.. బ్యాలెట్ పేపర్ పై జై ..మల్లన్న నినాదాలు..

దక్ష న్యూస్, నల్గొండ : జూన్ 5

ఎమ్మెల్సీ బై పోల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన తీన్మార్ మల్లన్న ( theenmar mallanna ) కు కొందరు అభిమానుల అత్యుత్సాహం దిమ్మెర పోయేలా చేస్తోంది. బుధవారం మధ్యాహ్నం నుండి నల్గొండ లో ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియలో అధికారులు సైతం విస్తుపోయేలా గ్రాడ్యుయేట్లు వేసిన ఓట్ల బ్యాలెట్ పేపర్ లు చెల్లని చిత్తు కాగితాల్లా మారి మల్లన్నకు షాక్ లమీద షాక్ లు ఇస్తున్నాయి. ఓటు వేయాల్సిన చోట కొందరు పట్టభద్రులు 1 అని వేయడానికి బదులు జై.. మల్లన్న జై జై మల్లన్న అని నినాదాలు రాయడంతో వారు వేసిన ఓట్లు చెల్లకుండా పోతున్నాయి.

read also : ప్రధాని పదవికి మోడీ రాజీనామా.. చివరిసారిగా మోడీ నివాసంలో సమావేశం ..హాజరైన బాబు, పవన్..

Hospital

మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు సమయానికి మల్లన్న 12వేల మెజార్టీతో ముందంజలో ఉండగా, అదే సమయానికి 8 వేల చెల్లని ఓట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. అందులో మల్లన్న కు చెందిన చెల్లని ఓట్లు 6 వేలకు పైగా ఉండడం విశేషం. రెండో స్థానంలో బిఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి, మూడో స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ గౌడ్ , నాలుగో స్థానంలో బిజేపి అభ్యర్థి కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

ప్రారంభమైన రెండో రౌండ్ ఓట్ల లెక్కింపు. ఆధిక్యంలో తీన్మార్ మల్లన్న. మరి కొద్ది సేపట్లో మొదటి ప్రాధాన్యత ఓట్లను ప్రకటించనున్న అధికారులు.

 

 

 

Leave A Reply

Your email address will not be published.