Read News in Telugu Language
adsdaksha

theenmar mallanna : మల్లన్న చూపు బీసీ సంఘాలవైపు..

దక్ష న్యూస్, హైదరాబాద్ : సెప్టెంబర్ 24

ఏకమవుతున్న బీసీ కులస్తులు..నేడు తాజ్ కృష్ణలో బీసీ కులాల ఆత్మీయ సమ్మేళనం..

మొదటి విడతలో పాల్గొనున్న..ముదిరాజ్, యాదవ, మున్నూరుకాపు,
గౌడ, పద్మశాలి ఇతర కులస్థులు ..

సోషల్ మీడియా (social media ) వేదికగా ప్రభుత్వ వైపల్యాలను ఎండగడుతూ ఎప్పటికప్పుడు ప్రజలను చైతన్య పరిచే ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్న ( theenmar mallanna ) ఎన్నికలు సమీపిస్తుండడంతో బీసీ ( bc ) ఓటర్లపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా తెలంగాణ ( telangana ) లోని బీసీ నాయకులను, ఓటర్లను చైతన్య పరిచి వారి ఓట్లను ప్రభుత్వ వ్యతిరేక ఓట్లుగా మార్చి చట్టసభల్లో బీసీల శాతం పెంచేందుకు కృషి చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. అందులో భాగంగా సోమవారం హైదరాబాద్ ( hyderabad ) లోని హోటల్ తాజ్ కృష్ణ ( hotel taj krishna ) లో బీసీ సంఘాల యువ నేతలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నట్లు సమాచారం. “రాబోయే ఎన్నికల్లో ఎవరిని ఓడించాలి ?” అనే అంశం మీద జరిగే తొలి విడత సమావేశంలో ముదిరాజ్, యాదవ, మున్నూరు కాపు,  గౌడ, పద్మశాలి ఇతర కులస్తులతో సమావేశం నిర్వహించనున్న మల్లన్న మరో సమావేశంలో మిగతా కులస్థులను భాగస్వాములను చేయనున్నట్లు తెలుస్తోంది.

read also : తెలంగాణ ప్రజలను స్కీంలు, స్కాంలతో దోచుకుంటుంన్నారు.. బండి సంజయ్..

Hospital

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్ నుండి శాసనసభకు పోటీ చేయనున్న మల్లన్న ఎన్నికలు సమీపిస్తుండడంతో అందుకు కావాల్సిన అస్త్రశస్త్రాలు సిద్దం చేసుకుంటుంన్నారు. అందుకు ఎప్పటినుండో రాజ్యాధికారం కోసం ఎదురుచూస్తున్న బీసీలను ఎస్సీ, ఎస్టీలను కలుపుకొని అధికారం సాధించే దిశగా కృషిచేయనున్నట్లు తెలుస్తోంది. అయితే మల్లన్న ఏ పార్టీ నుండి పోటీ చేస్తారనే దానిపై ఇంకా స్పష్టత రానట్లు తెలుస్తోంది. తాను ఏర్పాటు చేసుకున్న తెలంగాణ నిర్మాణ పార్టీ నుండా లేక కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.

read also : జర్నలిస్టుల ఇండ్ల స్థలాలపై ఉద్దేశపూర్వకంగానే కాలయాపన ..

గతంలో తీన్మార్ మల్లన్న టీం లో పనిచేసిన ఎంతో మంది ఔత్సాహిక యువత మల్లన్న పార్టీ స్థాపించితే, రానున్న ఎన్నికల్లో మల్లన్న పార్టీ నుండి పోటీ చేయడానికి సిద్దంగా ఉన్నప్పటికీ ఆ దిశగా మల్లన్న ప్రయత్నాలు చేయకపోవడం విస్మయానికి గురిచేస్తోంది.

రాజకీయ నాయకులకు బీసీల మీద మాటల్లో ఉన్న ప్రేమ చేతల్లో కనిపించడం లేదని విమర్శించే మల్లన్న ఇప్పుడు అదే అంశంపై ఆత్మీయ సమ్మేళనాల్లో చర్చ నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు సీట్లు కేటాయించే విషయంలో అన్ని రాజకీయ పార్టీలు వెనకాడుతున్నయని, ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ కేవలం 24 సీట్లను మాత్రమే బీసీలకు కేటాయించగా, కాంగెస్ మరో పది స్థానాలు ఎక్కువగా ఇస్తాం అని బీసీలకు 34 స్థానాలు కేటాయిస్తామని చెబుతోంది. పెద్దగా పోటీ లేని బీజేపీలోనూ బీసీలకు న్యాయం జరిగే అవకాశాలు కనబడడం లేదు. ఈ నేపథ్యంలో బీసీలను ఏకం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలు ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి.

 

Leave A Reply

Your email address will not be published.