Read News in Telugu Language
adsdaksha

రెడ్డోరు.. చౌదరి గారు కలిసిపోయారహో..

దక్ష న్యూస్, ఖమ్మం: సెప్టెంబర్ 3

గురు శిష్యుల పంతం బిఆర్ఎస్ అంతం..

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు..

బిఆర్ఎస్ ( brs ) బహిష్కృత నేత మాజీ ఎంపీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( ponguleti srinivas reddy ), ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయ దురంధరుడు, కీలక నేత తుమ్మల నాగేశ్వరరావు ( thummala nageswararao) ఒక్కటయ్యారు. బిఆర్ఎస్ నుండి భంగపడ్డ శ్రీనివాస రెడ్డి ఇప్పటికే తెలంగాణ ( telangana ) కాంగ్రెస్ ఎన్నికల కమిటీ కో చైర్మన్ గా కొనసాగుతుండగా, తుమ్మల అధికార పార్టీ నిర్లక్ష్యానికి గురై ఫైర్ మీద ఉన్నారు. తర్వాత బిఆర్ఎస్ బుజ్జగింపులు, తాయిలాలు ఆయనపై ప్రభావం చూపలేక పోయాయి. తనను ఇంత నిర్లక్ష్యం చేసిన బిఆర్ఎస్ పై గుర్రుగా ఉన్న తుమ్మలకు తమ పార్టీలో చేరాలంటూ అటు బిజేపీ ( bjp ) నుండి ఇటు కాంగ్రెస్ ( congress ) నుండి ఆహ్వానాలు అందాయి. ఎట్టకేలకు మొదట రేవంత్ రెడ్డి ( revanth reddy ), తర్వాత శ్రీనివాసరెడ్డి ప్రయత్నాలు ఫలించి తుమ్మల కాంగ్రెస్ లో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒక్కప్పటి గురువు శిష్యులు ఒక్క టవుటుండడంతో,  రెడ్డోరు చౌదరిగారు ఒక్కటయ్యారహో.. గురువు శిష్యులు కలిస్తే ఇక బిఆర్ఎస్ కు గడ్డుకాలమే అని ఇరువురు నాయకుల అభిమానులు, కార్యకర్తలు పండుగ చేసుకుంటుంన్నట్లు తెలుస్తోంది.

read also : గృహలక్ష్మి దరఖాస్తుల విచారణ ముమ్మరం..

ఎత్తులు.. జిత్తులు..
ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటుంన్నాయి. మొన్నటి వరకు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన ప్రతిపక్షాలకు తర్వాత ప్రభుత్వం గత ఎన్నికల హామీలను తెరపైకి తెచ్చి ఒక్కొక్కటి అమలు చేస్తుండడం తో వారిలో కొంత జోష్ తగ్గి ఎన్నికల బరిలోకి దింపే అభ్యర్ధులపై దృష్టి సారించారు. ఇంతలో బిఆర్ఎస్ తన మొదటి అభ్యర్ధుల జాబితా ప్రకటించింది. అప్పటి నుండి బిఆర్ఎస్ లో కలకలం మొదలైంది. గతంలోనే కొందరు మాజీ ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు పక్క పార్టీల వైపు చూడడం గమనించిన అధిష్టానం సిట్టింగ్ లకే సీట్లు అంటూ ప్రకటించి దాదాపు పాత వారికే పట్టం అని ప్రకటించే ప్రయత్నం చేసింది. దాంతో ఆశావహులు ప్రతిపక్షాల్లోకి జంప్ అయ్యే సూచనలు కనిపించడంతో మళ్ళీ ఇదే ఫైనల్ కాదు అనే సూచనలు పంపించే ప్రయత్నం చేసింది. కానీ మనోభావాలు దెబ్బతిన్న కొందరు సీనియర్ నేతలు బుజ్జగింపులకు తలొగ్గకుండా దెబ్బతిన్న బెబ్బులి లా బిఆర్ఎస్ ను అంతం చేస్తామని ప్రతీన బూనుతున్నారు. అందుకు ఉదాహారణే ఒకప్పటి పొంగులేటి, ఇప్పటి తుమ్మల.

Hospital

read also : తుమ్మల ఇంటికి పొంగులేటి ..ఆత్మీయ ఆలింగనంతో కుశలప్రశ్నలు..

పొంగులేటి రహదారి..
బిఆర్ఎస్ పార్టీలో ఉండి ధిక్కార స్వరం వినిపించి ఆపార్టీ నుండి సరైన ఆదరణ లేకపోవడంతో మనస్తాపంతో బైటికి వచ్చిన శ్రీనివాసరెడ్డి బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని పట్టుదలగా ఉన్నారు. ఈ క్రమంలో ఒక దశలో పొంగులేటి ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి ఒక్కరిని కూడా బిఆర్ఎస్ అభ్యర్ధులను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనని శపధం చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో సీట్ల పంపకం ఎలా ఉన్నా పొంగులేటి మాత్రం తన మాటకు కట్టుబడి ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే తన అనుచరుల్లో కొంత మందికి తను హామీ ఇచ్చినట్లు టికెట్లు వచ్చే అవకాశం కనిపించకపోయినా, కేవలం బిఆర్ఎస్ ను గద్దె దింపడమే లక్ష్యంగా తన అనుచరులను కార్యోన్ముఖులను చేసి రాబోయే ఎన్నికల రణరంగానికి సిద్దం చేశారు. దాంతో వారు కూడా తమకు సీటు కంటే, పొంగులేటి శపధం నెరవేర్చేందుకే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.

read also : మరపురాని మనిషి వైయస్ఆర్…పొంగులేటి శ్రీనివాస రెడ్డి

తన ప్రయత్నాల్లో భాగంగా పొంగులేటి బిఆర్ఎస్ అసంతృప్త నేతల్ని ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదని టాక్. అందుకు ఎప్పటికప్పుడు తన సొంత అభిప్రాయాలను కూడా అవసరాన్ని బట్టి మార్పులు చేసుకుంటూ కేవలం బిఆర్ఎస్ ను ఓడించడానికి కాంగ్రెస్ ను గెలిపించడాని శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లు రాజకీయ మేధావులు చర్చించుకుంటుంన్నారు. అందులో భాగంగా ఒకటి రెండు రోజుల్లో ఉమ్మడి జిల్లా నుండి మరో మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిసి రాహుల్ సమక్షంలో పార్టీ మారనున్నట్లు సమాచారం. తుమ్మల మాత్రం ఈనెల 18న తెలంగాణ విమోచన దినం సందర్భంగా సోనియాగాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోనున్నట్లు భోగట్టా.

ఇటు పొంగులేటి ప్రభంజనానికి తుమ్మల చాణక్యం తోడవనుండడం, మరో (తాజా) మాజీ ఎమ్మెల్యే జోష్ జత కానుండడంతో బిఆర్ఎస్ వర్గాలకు ఇక నిద్ర కరువే అనేది విశ్లేషకుల అంచనా. అయితే దాంతో కాంగ్రెస్ లో సమీకరణల ప్రభావం టికెట్ల కేటాయింపుపైన పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుండడం కొసమెరుపు.

Leave A Reply

Your email address will not be published.