Read News in Telugu Language
adsdaksha

డాక్టర్ల మద్దతుకై తుమ్మల వేట..

దక్ష న్యూస్, ఖమ్మం: అక్టోబర్ 17

ఓట్ల వేటలో రాజకీయ చాణక్యుడు..

వేగంగా కదులుతున్న పావులు..

రాజకీయ రంగంలో గత నలభై ఏళ్లుగా తనదైన శైలిలో ప్రత్యర్థులకు చుక్కలు చూపించే అపర చాణక్యుడు తుమ్మల నాగేశ్వరరావు ( thummala nageswararao ) కాంగ్రెస్ ( congress ) పార్టీ లో చేరక దూకుడు పెంచారు.

Hospital

ఖమ్మం జిల్లాలో బిఆర్ఎస్ ను నిలువరించడమేధ్యేయంగా పథకాలు రచించి నివురు గప్పిన నిప్పులా ప్రణాళికలు రూపొందిస్తూ..అమలు దిశగా వేగంగా అడుగులేస్తున్నారు.
ఇటీవల మాజీ ఎమ్మెల్సీ బాలసాని తో సంప్రదింపులు జరిపి కాంగ్రెస్ కండువా కప్పిన ఆయన మరో అడుగు ముందుకేసి ఖమ్మం కార్పొరేటర్ లతో చర్చలు జరిపారు. హడావిడిగా జరిగిన కార్యక్రమాల్లో వెంటనే అనుకున్నంతమంది బైటికి రాలేక పోయినా, త్వరలోనే రాహుల్ తెలంగాణలో ప్రారంభించబోయే బస్సు యాత్ర సందర్భంగా కాంగ్రెస్ లోకి వలసలు ఉండబోతున్నట్లు సమాచారం.

డాక్టర్లను కలిసి మద్దతు కోరిన తుమ్మల..

ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో భాగంగా మాజీ మంత్రి కాంగ్రెస్ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం ఖమ్మం నగరంలోని పలువురు వైద్యులను కలిశారు. ఈ సందర్భంగా సామాజిక వేత్త, ఐఎంఎ మాజీ సెక్రటరీ , యువం పౌండేషన్ చైర్మన్, ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్ ను తుమ్మల కలిశారు. దాదాపు అరగంట పైగా జరిగిన భేటీ లో తుమ్మల డాక్టర్ ప్రదీప్ కుమార్ ను కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు.
అనంతరం తుమ్మల ఖమ్మం నగరంలోని మరికొంతమంది వైద్యులతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.

Leave A Reply

Your email address will not be published.