Read News in Telugu Language
adsdaksha

తుమ్మల ఇంటికి పొంగులేటి ..ఆత్మీయ ఆలింగనంతో కుశలప్రశ్నలు..

దక్ష న్యూస్, ఖమ్మం: సెప్టెంబర్ 2

నాలుగేళ్ల తర్వాత కలుసుకున్న గురుశిష్యులు..

తుమ్మలను కాంగ్రెస్ లోకి రావాల్సిందిగా ఆహ్వానించిన శ్రీనివాసరెడ్డి..

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన రాజకీయ దురంధరుడు, సీనియర్ రాజకీయవేత్త తుమ్మల నాగేశ్వరరావు ( thummala nageswararao ) ను శనివారం కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ( ponguleti srinivas reddy ) ఆయన నివాసంలో కలిశారు. పొంగులేటి రాకతో సంతోషం వ్యక్తం చేసిన తుమ్మల పొంగులేటిని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. దాదాపు నాలుగేళ్ళ తర్వాత కలిసిన గురుశిష్యులు పరస్సరం కుశల ప్రశ్నలు వేసుకున్నారు. దుశ్శాలువాలతో సత్కరించుకున్నారు. బిఆర్ఎస్ ( brs ) పై అసంతృప్తితో వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా పోటీ చేయాలని పట్టుదలగా ఉన్న తుమ్మలను పొంగులేటి కాంగ్రెస్ ( congress ) పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఏ పార్టీలో ఉన్నా తుమ్మల ప్రజల కోసం చిత్తశుద్ధితో పని చేస్తారని, ఆయనకు ఎంతో రాజకీయ అనుభవం ఉందని కొనియాడారు. ఇప్పటికే తుమ్మలను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కలిశారని… తుమ్మలను కాంగ్రెస్ పార్టీలోకి రావాలని సాదరంగా ఆహ్వానిస్తున్నామని చెప్పారు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా కేసీఆర్, బీఆర్ఎస్ పద్ధతి ఉందని విమర్శించారు. ఏ పార్టీలో ఉన్నా నిజాయితీగా పనిచేసే వ్యక్తి తుమ్మలను కొన్ని శక్తులు పోమనలేక పొగపెట్టి బయటికి పంపించడం ప్రజలంతా గమనిస్తున్నారన్నారు.

Hospital

read also : మరపురాని మనిషి వైయస్ఆర్…పొంగులేటి శ్రీనివాస రెడ్డి

బీఆర్ఎస్ కు బలం లేని ఖమ్మం జిల్లాలో తుమ్మల లాంటి వ్యక్తులు పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశారని పొంగులేటి అన్నారు. అయినా సీఎం అపాయిట్ మెంట్ కూడా దొరకని పరిస్థితి ఉండేదన్నారు. తనకు చేసిన విధంగానే తుమ్మలను కూడా అవమానాలకు గురి చేశారని మండిపడ్డారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ను వీడిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరే ముందు తాను తన అనుచరులు, మద్దతుతారులతో చర్చించానని… వారందరి సూచనల మేరకే కాంగ్రెస్ లో చేరానని పొంగులేటి చెప్పారు. తుమ్మల కూడా వారి అనుచరులతో మాట్లాడి, ఆయన నిర్ణయాన్ని ప్రకటిస్తారని అన్నారు.

తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, కాంగ్రెస్ లోకి‌ తనను ఆహ్వానించడానికి వచ్చిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. కార్యకర్తల అభిప్రాయాల మేరకు తన నిర్ణయం ఉంటుందని వెల్లడించారు. తనకు ఏ అవకాశం వచ్చినా జిల్లా అభివృద్ధి కోసమే పని చేశానని అన్నారు. సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయడమే తన ధ్యేయమని అందుకోసమే తాను రాజకీయాల్లో కొనసాగుతున్నానని వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.