Read News in Telugu Language
adsdaksha

title suit : ప్రాపర్టీలకు సిబిల్ లాంటి యాప్.. టైటిల్ సూట్ గురించి మీకు తెలుసా..?

దక్ష న్యూస్, ఖమ్మం: అక్టోబర్ 20

భూమి కొనాలనుకుంటుంన్నారా..? తీరా కొన్నాక ఇది మా పేరు మీద ఎప్పుడో రిజిస్టర్ అయింది అని ఎవరు దస్తావేజులు పట్టుకొని వస్తారో అని భయపడుతున్నారా..? ఇప్పుడు ఆ భయం అక్కర్లేదు. వెంటనే టైటిల్ సూట్ ( title suit ) యాప్ డౌన్ లోడ్ చేసుకోండి. మీరు కొనే భూముల గురించి ముందే తెలుసుకోండి.
ఈ ప్లాట్ ఫామ్లో ఆ కేసు వివరాలు లిస్ట్ చేయమని ఇతరులను ప్రోత్సహించండి.

తెలంగాణలో ధరణి పోర్టల్ పుణ్యమా అని భూముల దందాలు ఎక్కువై పోయాయి. భూములు ఎవరివో.. వాటిని అనుభవించే వారెవరూ అర్థం కానీ పరిస్థితి. లక్షల రూపాయలు పెట్టి కొన్న భూమి తనదని మరో వ్యక్తి వచ్చి కేసులు పెట్టే పరిస్థితి దాపురించింది. ఈ నేపథ్యంలోనే టైటిల్ సూట్ అందుబాటులోకి వచ్చింది. భూముల తగాదాలకు తావులేకుండా ఆస్తి సంబంధిత సివిల్ సూట్లు/కేసుల డేటా యాప్ లో పొందుపరచండి. మీ బంధువులు, మిత్రులు ఎవరైనా కోర్ట్ లో కేసు దాఖలు చేసి ఉంటే వారిని టైటిల్ సూట్ ప్లాట్ ఫామ్లో ఆ కేసు వివరాలు లిస్ట్ చేయమని ప్రోత్సహించండి. అలా చేయటం వల్ల అవతలి వాళ్లు ఆ కేసు లో ఉన్న ఆస్తిని విక్రయించకుండా నిలుపుదల చేయవచ్చు. టైటిల్ సూట్ లో లిస్ట్ చేయబడిన ప్రతి కేసు అందరికీ అందుబాటులో ఉంటుంది. అదే విధంగా ఆ ఆస్తి యొక్క పూర్తి కేసు చరిత్రను వెల్లడిస్తుంది.

Hospital

read also : ప్రచార అనుమతులకు సువిధ పోర్టల్ లో నమోదు చేసుకోండి..

టైటిల్ సూట్ అనేది ప్రాపర్టీలకు సిబిల్ ( cibil ) లాంటిది. టైటిల్ సూట్ యాప్ ని అందరూ వినియోగించుకుంటే ఇకపై స్థిరాస్తి క్రయవిక్రయాలు న్యాయపరంగా జరగడానికి సహాయపడుతుంది. కేవలం మీ మొబైల్ ఫోన్ లో టైటిల్ యాప్ డౌన్ లోడ్ చేసుకుంటే చాలు.. మీరు కొనుగోలు చేసే భూమి ఎవరిదో దాని వెనుక ఉన్న వివరాలన్ని తెలుసుకోవచ్చు.

 

Leave A Reply

Your email address will not be published.