Read News in Telugu Language
adsdaksha

మళ్లీ టోల్ మోత…జూన్ 2 నుంచి అమలు..

దక్ష న్యూస్, హైదరాబాద్: మే 22

టోల్‌ రుసుమును 5 శాతం పెంచుతూ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ నిర్ణయం తీసుకుంది. దాంతో జాతీయ రహదారులపై ప్రయాణం చేసే వాహనదారులపై మళ్లీ టోల్ మోత మోగనుంది. జూన్ 2 నుంచి టోల్ ఛార్జీల పెంపు అమల్లోకి రానుందని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ వెల్లడించింది. ప్రతి ఏటా ఏప్రిల్‌ 1న టోల్ రుసుములు పెరుగుతాయి. కానీ ఈసారి లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పెంపు వాయిదా పడింది.

Read also: ధరణి పెండింగ్ దరఖాస్తులు నెలాఖరులోగా పరిష్కరించండి : జిల్లా కలెక్టర్ వి. పి. గౌతమ్..

ఎన్నికల నేపథ్యంలో టోల్‌ఛార్జీల పెంపును వాయిదా వేయాలని ఎన్నికల సంఘం ఎన్‌హెచ్‌ఏఐను ఆదేశించింది. దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో ఎన్నికలు జరగనుండగా.. చివరి విడత జూన్‌ 1న ఎన్నికలు ముగియనున్నాయి. ఆ రోజు అర్ధరాత్రి నుంచి టోల్‌ ధరలు పెరుగుతాయి. ఇప్పటికే ఈ మేరకు టోల్‌ప్లాజాల నిర్వాహకులకు ఎన్‌హెచ్ఏఐ ఉత్తర్వులను జారీ చేసింది.

Hospital

Read also: ప్రశ్నించే గొంతును చట్టసభలకు పంపాలి : సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి..

టోల్‌ రుసుము 5 శాతం పెంపు..

హైదరాబాద్‌-విజయవాడ (65) నేషనల్ హైవేను ఉదాహరణగా తీసుకుంటే.. ఈ హైవేపై తెలంగాణలోని చౌటుప్పల్‌ మండలం పంతంగి, కేతేపల్లి మండలం కొర్లపహాడ్‌, ఆంధ్రప్రదేశ్‌లోని చిల్లకల్లు వద్ద టోల్‌ప్లాజాలు ఉన్నాయి. కార్లు, వ్యాన్‌లకు ఒక వైపు ప్రయాణానికి రూ.5, రానూపోనూ కలిపి రూ.10, తేలికపాటి గూడ్స్ వెహికల్స్ ఒక వైపు రూ.10, ఇరు వైపులా అయితే రూ.20, అదే విధంగా బస్సు, ట్రక్కులకు రూ.25, రూ.35, భారీ రవాణా వాహనాలకు అయితే రూ.35, రూ.50 చొప్సున పెంచారు. 24 గంటల లోపు తిరుగు ప్రయాణం చేస్తే అన్ని రకాల వాహనాలకు ఛార్జీలో 25 శాతం మినహాయింపు ఉంటుంది. ఇక స్థానికుల నెలవారీ పాస్‌ను కూడా పెంచారు. ఆ పాసులను రూ.330 నుంచి 340కి పెంచారు. అయితే చౌటుప్పల్ పరిధిలోని పంతంగి టోల్‌ప్లాజాలో నిత్యం 30 వేల వాహనాలు, గుడూరు టోల్‌ప్లాజా మీదుగా 27 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి.

Leave A Reply

Your email address will not be published.