Read News in Telugu Language
adsdaksha

వాహనదారులకు శుభవార్త.. ట్రాఫిక్ చలాన్స్ చెల్లింపునకు గడువు పొడిగింపు..

దక్ష న్యూస్, అశ్వాపురం : జనవరి 10

ట్రాఫిక్ చలాన్స్ చెల్లింపునకు ప్రభుత్వం గడువును పొడిగించిందని ఈ అవకాశాన్ని పెండింగ్ చలానాలు ఉన్న వాహనదారులు ఉపయోగించుకోవాలని అశ్వాపురం సీఐ రవీందర్ పిలుపునిచ్చారు.

ట్రాఫిక్ చలాన్స్ గడువు పొడిగింపు సందర్భంగా సీ.ఐ మాట్లాడుతూ ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. ఈనెల 31వ తేదీ వరకు డిస్కౌంట్ చలాన్ కట్టేందుకు గడువు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.

Hospital

Read also: ఆనాడు బాధను దిగమింగి…. నా వాళ్లకు ధైర్యం చెప్పా…!

వాస్తవానికి పెండింగ్ చలాన్లను క్లియర్ చేసేందుకు డిసెంబర్ 26వ తేదీ నుంచి జనవరి 10వ తేదీ వరకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. నేటితో ఆ గడువు ముగియగా.. ఈ రోజు వరకు రూ. 107 కోట్ల చలాన్లు వసూళు అయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇంకా ఎంతో మంది ప్రజలు తమ వాహనాలకు సంబంధించి పెండింగ్ చలాన్స్ చెల్లించాల్సి ఉంది. లాస్ట్ డేట్ కావడంతో అందరూ ఒకేసారి ఈ-చలాన్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేశారు. దాంతో సైట్ స్లో అయ్యింది. దీంతో పెండింగ్ చలాన్స్ చెల్లించేందుకు గడువు పొడిగించాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు. ప్రజల కోరిక మేరకు ప్రభుత్వం పెండింగ్ చలాన్ చెల్లింపునకు గడువును జనవరి 31వరకు పొడిగించింది.

Leave A Reply

Your email address will not be published.