Read News in Telugu Language
adsdaksha

రెండు రైళ్లు ఢీ.. బంగ్లాదేశ్ లో ఘోర రైలు ప్రమాదం..

దక్ష న్యూస్, హైదరాబాద్: అక్టోబర్ 23

20 మంది మృతి .. 100మందికి పైగా గాయాలు..

పట్టాలు తప్పి పల్టీలు కొట్టిన 4 బోగీలు..

బంగ్లాదేశ్ ( bangladesh ) లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో 20 మంది దుర్మరణం చెందారు. 100 మందికి పైగా గాయాల పాలయ్యారు. సోమవారం సాయంత్రం బంగ్లాదేశ్ రాజధాని ఢాకా ( dhaka ) కు 80 కిలోమీటర్ల దూరంలో.. ఖైరబ్ ( khairab ) నే ప్రాంతంలో ఈ ట్రైన్ యాక్సిడెంట్ (train accident ) జరిగింది. కిషోర్ గంజ్ రైల్వేస్టేషన్ దగ్గర.. గూడ్స్ రైలును .. ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొన్నది. వేగంగా ఢీకొనటంతో.. నాలుగు బోగీలు పట్టాలు తప్పి పల్టీలు కొట్టాయి.

Hospital

read also : title suit : ప్రాపర్టీలకు సిబిల్ లాంటి యాప్.. టైటిల్ సూట్ గురించి మీకు తెలుసా..?

ఢాకా వెళుతున్న గోథూలీ ఎక్స్ ప్రెస్.. గూడ్స్ రైలును ఢీకొన్నట్లు స్థానిక రైల్వే అధికారులు చెబుతున్నారు. అసలు ప్రమాదం ఎలా జరిగింది… ఎదురెదురుగా ఢీకొన్నాయా.. గూడ్స్ రైలును వెనక నుంచి ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొన్నదా అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని.. మృతుల సంఖ్య భారీగా పెరగొచ్చని అధికారులు ప్రకటించారు. కొన్ని బోగీలు నుజ్జునుజ్జు అయ్యాయని.. అందులో చాలా మంది చిక్కుకున్నారని.. సహాయక చర్యలు వేగంగా సాగుతున్నట్లు వెల్లడించారు. రైళ్లు ఢీకొన్న తర్వాత బంగ్లాదేశ్ వ్యాప్తంగా చాలా రైలు సర్వీసులకు అంతరాయం కలిగింది.

గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ప్రమాద స్థలానికి అత్యవసర సర్వీసులు వచ్చాయని, స్థానిక ప్రజల సహకారంతో వేగంగా సహాయ చర్యలు జరుగుతున్నట్లు బంగ్లాదేశ్ రైల్వే అధికారులు వెల్లడించారు. విచారణ తర్వాత ప్రమాదానికి కారణాలను వెల్లడిస్తామంటున్నఅక్కడి ప్రభుత్వం, రైలులోని మిగతా ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు చేర్చటానికి ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.

Leave A Reply

Your email address will not be published.