Read News in Telugu Language
adsdaksha

travel: ట్రావెల్ అండ్ టూరిజం ఫెయిర్ .. ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్..

దక్ష న్యూస్, హైదరాబాద్ : సెప్టెంబర్ 9

హైదరాబాద్ ( hyderabad ) లోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో ( hicc ) ట్రావెల్ అండ్ టూరిజం ఫెయిర్ ( ttf ) ను శనివారం రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా ,పర్యాటక, సాంస్కృతిక ,పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ ( srinivas gaud ) ప్రారంభించారు. ఈనెల 9, 10 వ తేదీలలో జరుగుతున్న ట్రావెల్ అండ్ టూరిజం ఫెయిర్ ( travel and tourism fair ) లో మలేషియా ( malaysia ) నేపాల్ ( nepal ) థాయిలాండ్ ( thailand ) లాంటి దేశాలతో పాటు హర్యానా ( haryana )  హిమా చల్ ప్రదేశ్ (himachal prades )  ఝార్ఖండ్ (jharkhand )  గుజరాత్ ( gujarat) మధ్యప్రదేశ్ ( madyapradesh ) పుదుచ్చేరి ( puduchheri ) లాంటి రాష్ట్రాల నుండి టూరిజం ప్రమోషనల్ స్టాల్స్ ( tourism promotion stalls ) ను ఏర్పాటు చేశారు.

read also : కాళోజీ అవార్డు అందుకున్న కవి జయరాజ్..

వీటి తోపాటు ఇండియా టూరిజం జజీరా ఎయిర్వేస్ రాయల్ ఆర్కిడ్ హోటల్స్ ట్రావెల్స్ ఫారిన్ హాలిడేస్ రియా ట్రావెల్స్ రాడిసన్ హోటల్స్ ఆర్ వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సి జి హెచ్ డి క్లబ్ సైడ్ లాంటి టూరిజం సంస్థలు ఫెయిర్స్ లో తమ స్టాల్స్ ను ఏర్పాటు చేశాయి.

Hospital

read also : ఎస్సీ కులాల సహకార అభివృద్ధి కార్పోరేషన్’ చైర్మన్ గా ఏర్పుల నరోత్తమ్ ..

ఈ కార్యక్రమంలో తెలంగాణ టూరిజం ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీమతి శైలజ రామయ్యార్, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ ఎండి మనోహర్, మలేషియా టూరిజం డైరెక్టర్ రైజిడి, జపాన్ కొరియా కు చెందిన హోండా మోటార్స్ ఇండియా సేల్స్ మేనేజర్ మొరట, ప్రముఖ టూర్స్ ట్రావెల్స్ టూరిజం స్టేట్ హోల్డర్స్ సంస్థను ఈ ఫెయిర్ లో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.