Read News in Telugu Language
adsdaksha

కాళేశ్వరం కాగ్ రిపోర్టు సభలో ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ..

దక్ష న్యూస్, హైదరాబాద్ : ఫిబ్రవరి 15

తెలంగాణలో కృష్ణా, గోదావరి జలాల పంచాదీ నడుస్తున్న క్రమంలోనే రేవంత్ సర్కార్ కాళేశ్వరం ( kaleswaram ) పై కాగ్ ఇచ్చిన రిపోర్టును ప్రజల ముందుంచింది. ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనకు వెళ్లిన సీఎం సహా మంత్రులు, ఎమ్మెల్యేల బృందం మేడిగడ్డ ( medigadda ) లో కృంగిన విషయాల్ని పరిశీలించి వచ్చారు. అయితే తాజాగా కాళేశ్వరంలో జరిగిన అవినీతి, అక్రమాలపై వివరిస్తూ గత బీఆర్ఎస్ ( brs ) ప్రభుత్వం చేసిన దోపిడీని ప్రభుత్వం ఎండగట్టేలా ప్లాన్ చేసింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో (TS Assembly Session) కాగ్ రిపోర్టును (CAG Report) గురువారం ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలను కాగ్ రిపోర్ట్‌ పొందుపరిచింది.

Hospital

డీపీఆర్‌లో రూ.63,352 కోట్లు చూపెట్టగా రూ.1,06,000 కోట్లకు అంచనా వ్యయం పెంచారని.. ప్రస్తుత నిర్మాణం వరకు 14 లక్షల ఎకరాలకు ఆయకట్టు ఉందని కాగ్ తన నివేదికలో పేర్కొంది. మొత్తం ఈ ప్రాజెక్టు పూర్తయ్యే వరకు 1,47,427 కోట్లు ఖర్చు అవుతుందని, ప్రాజెక్టు నుంచి ఊహించిన ప్రయోజనాలను ఎక్కువ చూపెట్టారని తెలిపింది. ప్రాజెక్టు వార్షిక ఖర్చు లు తక్కువ చూపారని ప్రకటించింది. కాళేశ్వరం నీటి అమ్మకం ద్వారా రూ.1019కోట్ల ఆదాయాన్ని అంచనా వేశారని, ప్రాజెక్టు కోసం భారీగా రుణాలు తీసుకున్నట్లు కాగ్ రిపోర్టులో వివరించింది.

read aalso : సివిల్స్ నోటిఫికేషన్.. మే 26న ప్రిలిమ్స్.. అక్టోబర్ 19న మెయిన్స్ ..

కాళేశ్వరం అప్పు కట్టుకుంటూ పోతే 2036 లో పూర్తవుతుందని అంటూ కాగ్ నివేదికలో పేర్కొంది. 15 బ్యాంకులతో రూ. 87 వేల కోట్లు సమకూర్చుకోవాలని ఒప్పందం చేసుకున్నారని, బడ్జెటేతర రుణాలపై ప్రభుత్వం ఎక్కువ ఆధారపడి ఉందని పేర్కొంది. రుణాలు చెల్లించడంలో కాలయాపన చేసిందని తెలిపింది. ప్రాజెక్టు నిర్వహణ కోసం ప్రతీ సంవత్సరం రూ.700 కోట్ల నుంచి 14 వేల 5 వందల కోట్ల వరకు ఖర్చు అవుతుందని.. రుణాలు కట్టడం కోసం మళ్ళీ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని రిపోర్టులో వెల్లడించింది.

Leave A Reply

Your email address will not be published.