Read News in Telugu Language
adsdaksha

ఈఏపీసెట్‌ షెడ్యూల్‌ రిలీజ్ ..మే 9 నుంచి పరీక్షలు..

దక్ష న్యూస్, హైదరాబాద్: పిబ్రవరి 7

తెలంగాణలో ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి నిర్వహించనున్న టీఎస్ ఈఏపీసెట్  ( ts eap set ) షెడ్యూల్డ్ విడుదలైంది. ఈ మేరకు సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ డీన్ కుమార్ ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో.. ఫిబ్రవరి 21న ఈఏపీసెట్ నోటిఫికేషన్ వెలువడనున్నట్టు పేర్కొన్నారు.

Hospital

Read also: మధ్యప్రదేశ్‌లో భారీ పేలుడు.. బాణసంచా ఫ్యాక్టరీలో 11 మంది కార్మికులు మృతి..

ఫిబ్రవరి 26 నుంచి ఏప్రిల్ 6 వరకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్టు తెలిపారు. మే 9 నుంచి 11 వరకు ఎంసెట్ ఇంజినీరింగ్ కోర్సుల‌కు ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ నిర్వహిస్తామని చెప్పారు. అలాగే మే 12న అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ప్రవేశ పరీక్ష జరగనుందన్నారు. ఉన్నత విద్యామండ‌లి ఇటీవలే ఎంసెట్ పేరును ఈఏపీసెట్‌గా మార్చిన సంగతి తెలిసిందే. జేఎన్టీయూ హైదరాబాద్ పరీక్షలు నిర్వహించనుంది.

Leave A Reply

Your email address will not be published.